Advertisement
Google Ads BL

ఈ ఇద్దరు మాత్రమే ఫిక్సయ్యారు...!


ఆగష్టు 11ను చాలా మంది టార్గెట్‌ చేశారు. ఎన్టీఆర్‌ అని, పవన్‌ అని ప్రచారం జరిగింది. ఇక సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో రూపొందుతున్న 'జవాన్‌, రానా-తేజల 'నేనే రాజు నేనే మంత్రి' లతో పాటు నితిన్‌-హనురాఘవపూడిల 'లై'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న 'జయ జానకి నాయకా' కూడా వస్తాయనే ప్రచారం జరిగింది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ రేసులో ఇద్దరే నిలబడ్డారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'అ..ఆ' చిత్రం నితిన్‌ని 50కోట్ల క్లబ్‌లో చేర్చింది. కానీ ఆ క్రెడిట్‌ నితిన్‌కి కాక త్రివిక్రమ్‌, సమంతలకు వచ్చింది. దాంతో నితిన్‌ నిజమైన స్టామినా ఏమిటో ఆయన చేస్తున్న 'లై' తేలుస్తుంది. టాలెంటెడ్‌ దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వం వహించడం, బాగా సినిమాను ప్రమోట్‌ చేయగలిగిన 14 రీల్స్‌ సంస్థ దీనిని నిర్మించడం ప్లస్‌ పాయింట్‌. 

ఇక ఇది ఓ వైవిధ్యమైన చిత్రంగా చెబుతున్నారు. మరోవైపు హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ పెద్దగా హీరో కాకపోయినా బోయపాటి శ్రీను వంటి టాప్‌ డైరెక్టర్‌ తన పంధాను వదిలి, విభిన్న చిత్రంగా 'జయ జానకి నాయకా' కూడా ఆగష్టు11నే విడుదల కానుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండటం, మిర్యాల రవీందర్‌తో పాటు బెల్లంకొండ సురేష్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌ వెనుక ఉండటంతో ఈ చిత్రం కూడా భారీఎత్తున విడుదలకానుంది. 

ఈ రెండు చిత్రాల యూనిట్స్‌ మాత్రం తాము ఎప్పుడొచ్చినా తమ సినిమాలు హిట్టవుతాయని, తమ చిత్రాలలో ఆ దమ్ముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవ కానుకంగా వచ్చిన లాంగ్‌వీకెండ్‌ని ఏ చిత్రం సద్వినియోగం చేసుకుంటుందో వేచిచూడాలి....! 

LIE and Jaya Janaki Nayaka Movies are Release on Same Date:

Nithiin acted movie 'LIE' this movie director by Hanu raghavapudi and Bellamkonda Sai sreenivas acted movie 'Jaya Janaki Nayak' this movie director by Boyapati Srinu, these two movies releasing dates are same on august 11th 2017.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs