Advertisement
Google Ads BL

మెగాహీరోల మద్య పోరు..!


మెగాహీరో వరుణ్‌ తేజ్‌ 'లోఫర్‌, మిస్టర్‌'ల డిజాస్టర్స్‌తో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'ప్రేమమ్‌' బ్యూటీ సాయి పల్లవి నటించే 'ఫిదా'పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు. దిల్‌రాజు నిర్మించడం, ఫేడవుట్‌ అయిన శేఖర్‌ కమ్ముల డూ ఆర్‌ డై అన్నట్లు కసితో తీస్తుండటం కూడా ఈ చిత్రానికి ప్లస్‌కా నుంది. మరోపక్క ఇది శేఖర్‌ స్కూల్‌లోలాగానే ఓ ఎన్నారై యువకునికి,ఓ తెలంగాణ అమ్మాయికి మద్య జరిగే సున్నితమైన, హృద్యమైన ప్రేమకధా చిత్రం కావడం మరింత విశేషం. 

Advertisement
CJ Advs

ఇలాంటి వెరైటీ చిత్రాలు వరుణ్‌ తేజ్‌కి బాగానే కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్దమవుతోంది. దాంతో ఈ చిత్రం సోలోగా విడుదలయ్యే అవకాశం ఉందని భావించారు. మెగా హీరోలు ఎలాగూ తమ చిత్రాలకు తమ చిత్రాలే పోటీ కాకుండా జాగ్రత్తలు పడతారు. దాంతోనే సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన 'జవాన్‌'ని వాయిదా వేశారు. 

కానీ అనుకోకుండా సాయి ధరమ్‌ తేజ్‌ పోలీస్‌గా పవర్‌ఫుల్‌, అండ్‌ కీరోల్‌లో నటిస్తున్న 'నక్షత్రం' చిత్రం కూడా ఈనెల 21నే అంటే 'ఫిదా' రోజునే విడుదలవుతుందనే ప్రచారం మొదలైంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం చాలా కాలంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈరోజు ఆడియోను విడుదల చేయనున్నారు. సందీప్‌ కిషన్‌ మెయిన్‌ హీరో అయినా ఈ చిత్రంలో సాయి పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్ర నిడివిని బాగా పెంచాలనే వార్తలు కూడా వచ్చాయి. 

21వ తేదీకి ముందే రిలీజ్‌ చేయాలంటే కష్టం. కాగా 'ఫిదా' వచ్చిన తర్వాత మరో వారం ఆగి నెలాఖరులో వద్దామంటే గోపీచంద్‌ సంపత్‌ నందిల కాంబినేషన్‌లో మంచి బజ్‌ తెచ్చుకున్న 'గౌతమ్‌ నందా' విడుదల కానుంది. కాగా 'ఫిదా', 'నక్షత్రం'లు వేటికవే భిన్నం కావడం, శేఖర్‌ కమ్ముల, కృష్ణ వంశీలది డిఫరెంట్‌ స్కూల్‌ కావడంతో 'ఫిదా' ఏ సెంటర్‌ ఆడియన్స్‌ని, 'నక్షత్రం' మాస్‌ ప్రేక్షకులను ఓపెనింగ్స్‌ ద్వారా రాబట్టుకోవచ్చునని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Fidaa and Nakshatram Movies Release on 21st July 2017:

Varun Tej acted movie 'Fidaa' this movie director by Sekhar Kammula, and Sai Dharam Tej and Sundeep Kishan acted movie 'Nakshatram' this movie director by Krishna Vamsi. This Two movies release are same date on 21st July 2017.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs