Advertisement
Google Ads BL

బడ్జెట్‌ భారీగానే పెడుతున్నారు.. ఫలితం చూడాలి!


జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా సాగనున్న 'బిగ్‌బాస్‌'షో పై తాజాగా వచ్చిన వార్తలతో సస్పెన్స్‌ వీడింది. ఈ కార్యక్రమం ఈనెల 16వ తేదీ నుంచి బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడానికి వస్తోంది. కాగా ఈ కార్యక్రమం ప్రతి రోజు రాత్రి 9.30 నిమిషాల నుంచి స్టార్‌ మాలో ప్రసారం కానుంది. ఇక శని, ఆది వారాలు మాత్రం రాత్రి 9గంటలకే ఈ షో ప్రారంభమవుతుంది. 

Advertisement
CJ Advs

మొత్తం ఈ పోటీలో పాల్గొనడానికి 100  మందికి పైగా సెలబ్రిటీలు పాల్గొనడానికి ముందుకు వచ్చినా కూడా పలు వడపోతల అనంతరం కేవలం 12 మందిని మాత్రమే సెలక్ట్‌ చేశారు. వీరిని ఓ బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి పంపి 70రోజుల పాటు వారిని లాక్‌ చేస్తారు. ఆ 70  మందిని 70 కెమెరాలు సునిశితంగా పరిశీలిస్తుంటాయి. వీరికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. 

వీరు 12 మంది తెలుగు వీక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తారని ఎన్టీఆర్‌తోపాటు కార్యక్రమ నిర్వాహకులు కూడా కాన్పిడెన్ట్‌గా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ షో ప్రోమోస్ కి మంచి ఆదరణ లభించింది. ఏకంగా 5.5కోట్ల వ్యూస్‌ని తెచ్చుకుంది. అదే స్థాయిలో కార్యక్రమం కూడా హిట్టవుతుందని భావిస్తున్నారు. దీని కోసం దాదాపు 10వేల అడుగుల పెద్ద బిగ్‌బాస్‌ హోస్‌ని నిర్మించారు. 

దీని కోసం ఏకంగా 750మంది కష్టపడ్డారంటే ఈ హౌస్‌ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి షో ఎలా ఉన్నా మన వీక్షకులకు కొత్త కాబట్టి మొదటి రెండు, మూడు సీజన్లకు ఢోకా ఉండకపోవచ్చు. కాగా ఇందులో పాల్గొంటున్న 12 మంది సెలబ్రిటీలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

Jr NTR Host Bigg Boss Show Update:

Jr NTR is hosted 'Bigg Boss' show teclast in star maa channel on 16th july 2017. In this Bigg Boss house constructed nearly 10 housand feets. and 12 celebrities participated in this show.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs