Advertisement
Google Ads BL

లక్ష్మీపార్వతి..వర్మకి సవాల్ విసురుతోంది!


ఎన్టీఆర్ బయోపిక్ ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తాడు అని న్యూస్ ఎప్పుడైతే మీడియాలో  వచ్చిందో అప్పటినుండి ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ తీసుకెళ్లి ఆ వర్మ చేతిలో పెట్టడమేమిటి...అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చే నడుస్తుంది. అసలు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తాడో? అని అందరూ అనుమాన పడుతుంటే... ఈ చిత్రంలో తన తండ్రి పాత్రలో తానే నటిస్తానని బాలకృష్ణ ఎప్పుడో ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తే బాగోదని అంటున్నారు.

Advertisement
CJ Advs

అలా అన్నది ఎవరో కాదు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి. అసలు ఈ ఎన్టీఆర్ బయోపిక్ లో తన కేరెక్టర్ ని ఎలా చూపెడాతారో అని ఎప్పటినుండో భయపడుతున్న లక్ష్మి పార్వతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పినప్పటి నుండి ఎన్టీఆర్ జీవితంలో జరిగినవి మాత్రమే చెప్పాలని, చంద్రబాబుని విలన్ గా చూపెడతారా అని ప్రశ్నలు రేజ్ చేస్తూనే వుంది. సినిమాల ద్వారా ఎప్పుడూ రాంగోపాల్‌వర్మ వివాదాలు సృష్టిస్తారని..  ఈ సినిమాను యథార్థంగా తీస్తే వర్మపై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకుంటానని సవాల్ విసురుతోంది లక్ష్మీపార్వతి.

అలాగే ఎన్టీఆర్ బయో పిక్ లో బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తానంటే ఒప్పుకోనని... బాలకృష్ణ అమాయకుడని చెబుతుంది. అయితే ఎన్టీఆర్ పాత్రకు హీరోగా కమలహాసన్‌ అయితే బాగుంటుందని లక్ష్మీపార్వతి అభిప్రాయం. కానీ మరో పక్క టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి ఎన్టీఆర్ బయోపిక్ ని టచ్ చేయడం మంచిది కాదంటున్నాడు. ఒకవేళ అది తెరకెక్కిస్తే ఆ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని హరికృష్ణ గాని బాలకృష్ణగాని చేస్తేనే బావుంటుందని.... ఏదైనా ఆయన రక్త సంబంధీకులే ఈ సినిమా చెయ్యాలని అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాతగారు ఎన్టీఆర్ హావభావాలను బాగా పలికించగలడని... ఆయన మొహం అచ్చం తాతగారి మొహంలాగే ఉంటుంది.. కానీ ఎన్టీఆర్ పాత్ర చేయడానికి తారక్ కి వయసు సరిపోదంటున్నాడు.

మరి ఇప్పుడే ఇటువంటి అభిప్రాయాలు..వ్యక్త మవుతుంటే..మున్ముందు ఈ చిత్రం గురించి ఇంకెన్ని సంచలన వార్తలు వినాల్సి వస్తుందో...కదా!

Lakshmi Parvathi Comments on NTR Biopic:

Lakshmi Parvathi has reacted to this sensational development and she raised doubts over RGV's calibre to direct NTR's biopic, by expressing that RGV is a controversial director. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs