Advertisement
Google Ads BL

కేశవా... బాగానే ఊపులో ఉన్నావ్‌...!


హీరో నిఖిల్‌ సుడి మామూలుగా లేదు. 'స్వామిరా..రా'తో మొదలు పెట్టిన జైత్రయాత్ర 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దాకా సాగింది. పెద్ద నోట్ల రద్దు వల్లే తమ చిత్రాలకు కలెక్షన్లు తగ్గాయని కుంటిసాకులు చెప్పుకునే హీరోలకు, మేకర్స్‌కి ఈ చిత్రం చెంపపెట్టులాంటిది. అలాంటి సమయంలో కూడా దాదాపు నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించి, ఏకంగా మూడు నాలుగింతలు లాభం చేకూర్చింది. 

Advertisement
CJ Advs

దీంతో నేటితరం యంగ్‌ హీరోలలలో నాని తర్వాత శర్వానంద్‌, రాజ్‌ తరుణ్‌లను కూడా వెనక్కినెట్టి నిఖిల్‌ కర్చీఫ్‌ వేసేశాడు. ఇక 'కేశవ'చిత్రం బాగా లేదని టాక్‌ వచ్చినా, తన నుంచి ప్రేక్షకులు కోరుకునే వెరైటీ వల్ల తనకోసం ప్రేక్షకులు సినిమా చూస్తారని, ఆ సత్తా, ఆ అభిరుచి,తనకు ఉన్నాయని, ప్రేక్షకులు కూడా తనను నమ్ముతున్నారని నిఖిల్‌ నిరూపించాడు. ఈ చిత్రం కూడా కాస్త లాభాలనే తెచ్చిపెట్టింది. 

దాంతో నిఖిల్‌కి నిర్మాతల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఆయన తమిళంలో హిట్టయిన 'కనిదన్‌' రీమేక్‌కి ఆయన ఓకే చెప్పాడు. తమిళంలో ఈ చిత్రం ఒరిజినల్‌ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన సంతోష్‌ దీని ద్వారా టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన బడా ప్రొడ్యూసర్‌ కలైపులి థాను తానే దీనిని తెలుగులో కూడా రీమేక్‌ చేయాలని ఉన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్‌ అవకాశం తమకు ఇవ్వమని నిర్మాతలు నిఖిల్‌ని, కలైపులి థానును రిక్వెస్ట్‌ చేస్తున్నారట. 

ఏకంగా చిత్రం వదులుకుంటే రీమేక్‌ రైట్స్‌ను 1.5కోట్లకు కొంటామని తెలుగు నిర్మాతలు కలైపులి థాను వెంట పడుతున్నారని సమాచారం. మరి కళైపులి థాను ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి. అయిన 'హ్యాపీడేస్‌'లో తనతో పాటు పరిచయమైన వరుణ్‌ సందేశ్‌, టైసన్‌లు నిలబెట్టుకోలేని కెరీర్‌ను నిఖిల్‌ చక్కగా ప్లాన్‌ చేసుకుంటున్నాడనే చెప్పాలి....! 

Nikhil in Tamil Remake Movie 'Kanithan':

Hero Nikhil has recently said he is remaking the Tamil film 'Kanithan' remake. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs