Advertisement
Google Ads BL

శర్వా.. తొందరపడుతున్నాడేమో..!


నేడున్న యువహీరోలలో మంచి టాలెంట్‌ ఉన్న హీరో శర్వానంద్‌. ఆయన కెరీర్‌లో ఆయన నటునిగా ఎప్పుడు ఫెయిల్‌కాలేదు. 'ప్రస్థానం' వంటి చిత్రాలలో సాయి కుమార్‌కి ధీటుగా నటించాడు. కాగా ఆయనకు మొదటి కమర్షియల్‌ బ్రేక్‌ 'రన్‌ రాజా రన్‌'. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'తో కమర్షియల్‌గా కూడా ఓకే అనిపించాడు. 'ఎక్స్‌ప్రెస్‌ రాజా, శతమానం భవతి'లతో కలెక్షన్లు కురిపించాడు. 

Advertisement
CJ Advs

కాగా ఇటీవల ఆయన చంద్రమోహన్‌ అనే నూతన దర్శకునితో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మాతగా 'రాధ' చేశాడు. ఈ చిత్రం మొదటి వీకెండ్‌ ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత పరాజయం పాలైంది. ఏదో మాస్‌ పాత్రలో అందునా అందరికీ కలిసొచ్చే పోలీస్‌ పాత్ర కావడం, దాంతో పాటు మంచి మాస్‌ హీరోయిజం చూపించాలని చూసినా ప్రేక్షకులు ఆదరించలేదు. కాగా ఇప్పుడు ఆయన తనకు హోం ప్రోడక్షన్‌ వంటి యువి క్రియేషన్స్‌ బేనర్‌లో 'మహానుబాహుడు' చేస్తున్నాడు. 

దీనికి మారుతి దర్శకుడు, మారుతి నానికి 'భలే భలే మగాడివోయ్‌'కి ఇచ్చినట్లు తనకు కూడా పెద్దహిట్‌ను మారుతి ఇస్తాడని, యువి క్రియేషన్స్‌ మంచి అభిరుచి ఉన్న బేనర్‌ కావడంతో 'రాధ'తో డీలాపడ్డ శర్వాకి ఈ చిత్రం చాలా ఇంపార్టెంట్‌కానుంది. ఇక 'భలే భలే మగాడివోయ్‌' తర్వాత మన మారుతీ బాబు కూడా 'బాబు బంగారం'వంటి బంగారమైన చాన్స్‌ మిస్‌ చేసుకున్నాడు. సో.. మారుతికి కూడా ఇది చాలా ముఖ్యమైన చిత్రం. 

ఇక ఇందులో కూడా శర్వా స్టార్స్‌ చేసినట్లు ఎగిరి ఎగిరి వంద మందిని తన్నే సీన్స్‌ చేయనున్నాడని టాక్‌. ఎంతైనా మారుతి, శర్వాలు కాస్త ముందు వెనుక ఆలోచించుకోవడం బెటర్‌ అని చెప్పాల్సిందే...! 

Sharwanand New Movie 'Mahanubhavudu' Soon:

Sharwanand is next acting in UV Creations such as Home Production Banner are in 'Mahanubhavudu' movie. In this movie director by Maruthi.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs