Advertisement
Google Ads BL

వావ్..నిజంగా మోహన్ లాలేనా..!?


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు యంగ్ బాయ్ లా కనిపించబోతున్నాడు. అదేమిటి 57 ఏళ్ల వయసున్న మోహన్ లాల్ కుర్రాడిలా కనిపించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి మీరు ఎప్పుడూ చూసే మోహన్ లాల్ ఇప్పుడు ఎంత యంగ్ గా వున్నాడో పై ఫొటోలో చూడండి. అసలు మోహన్ లాల్ ఇలా కుర్రాడి అవతారమెత్తింది 600 కోట్ల బడ్జెట్.. అత్యంత భారీతనంతో తెరకెక్కబోతున్న సినిమా కోసమేనంట.  మలయాళంలో వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఒడియన్ మూవీ కోసమే మోహన్ లాల్ ఇలా కుర్రాడిగా మారిపోయాడు. ఒడియన్ చిత్రానికి చెందిన మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 

Advertisement
CJ Advs

ఆ మోషన్ పోస్టర్ లో మోహన్ లాల్ లుక్ కి సూపర్ క్రేజ్ వచ్చేసింది.  ఆ లుక్ కి అంత క్రేజ్ రావడానికి కారణం.. మోహన్ లాల్ కుర్రాడిగా మారిపోవడమే. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్ ఒడియన్ మాణిక్యన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఫాంటసీ కథగా తెరకెక్కే ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తారని చెబుతున్నారు. 

జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ కి పెదనాన్నగా, మనమంతాలో మిడిల్ క్లాస్ మనిషిగా, మన్యంపులి, కనుపాప సినిమాలతో మెప్పించిన మోహన్ లాల్ ఇప్పుడు  ఒడియన్ లో కూడా ఇలా కుర్రాడిలా ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చెయ్యడానికి వచ్చేస్తున్నాడు. ఇకపోతే ఒడియన్ సినిమా డైరెక్టరే 1000 కోట్ల భారీ బడ్జెట్ తో మహాభారతని తెరకెక్కిస్తానని చెప్పిన డైరెక్టర్ శ్రీకుమార్ కావడం విశేషం.

Mohanlal Young Look in Odiyan Movie :

Mohanlal Odiyan Movie Motion Poster Released. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs