Advertisement
Google Ads BL

చిరు వెళ్ళొచ్చాడు..పవన్‌ వెళ్తున్నాడు!


తెలుగు చిత్రాల మేకర్స్‌ ఇప్పుడు యూకే, యూరోపియన్‌ కంట్రీస్‌లోని మరికొన్నిదేశాలలో బాగా షూటింగ్‌లు జరుతున్నారు. ఇంతకాలం అమెరికా, బ్యాంకాక్‌, మలేషియా అంటూ తిరిగిన వారు అక్కడ లోకేషన్లు ప్రేక్షకులకు బాగా అలవాటు పడటంతో పోర్చుగల్‌, జర్మనీ, ఇటలీ, బల్గేరియా, చెకోస్లేవేకియా అంటున్నారు. దానికి కారణం ఆయా దేశాల మన షూటింగ్‌లకు అక్కడ సులభంగా పర్మిషన్‌ ఇచ్చి, ఎలాంటి అడ్డంకులు ఎదుర్కోకుండా చేయడంతో పాటు తద్వారా తమకు హాలీడే స్పాట్‌లుగా ప్రాచుర్యం వస్తాయని వారు భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs

మరికొన్నిదేశాలైతే తమ దేశంలో షూటింగ్‌ తీస్తే ఇంత మొత్తాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారు. దాని వల్ల '1' (నేనొక్కడినే) తో పాటు పలువురు నిర్మాతలు లాభపడ్డారు. విదేశాలకయ్యే ఖర్చు దాదాపు మన స్టూడియోలలో వేసే భారీ సెట్లకు సరిసమానంగా ఉండటం, ప్రకృతి అందాల మధ్య తీస్తే ఆ ఆనందమే వేరు కావడం, మందీ మార్బలంలో వెళ్లాల్సిన అవసరం లేకుండా చకచకా షూటింగ్స్‌ వేగంగా జరగడం, మధ్యలో ఫ్యాన్స్‌ వచ్చారనో,లేక ఈరోజు పనుందనో హీరో హీరోయిన్లు జంప్‌ కాకుండా వేగంగా ఫినిష్‌ చేసే సౌలభ్యం ఉండటం దీనికి ప్రధాన కారణం. 

కాగా ఇటీవల చిరంజీవి తన 'ఖైదీ నెంబర్‌ 150'లోని పాటల కోసం బల్గేరియా వెళ్లాడు. ఆ లోకేషన్స్‌ భలే ఉన్నాయి. దాంతో 'అత్తారింటికి దారేది' కోసం స్పెయిన్‌, 'గబ్బర్‌సింగ్‌' కోసం స్విట్జర్లాండ్‌, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' కోసం ఇటలీ వెళ్లిన పవన్‌.. త్రివిక్రమ్‌ తో చేసే చిత్రం కోసం బల్గేరియాకు వెళ్లి అక్కడే తన అన్నయ్య చేయని కొత్త లోకేషన్స్‌లో పాటల చిత్రీకరణలో పాల్గొననున్నాడు.  

Pawan Kalyan and Trivikram Film Songs Shooting in Europe :

Pawan Kalyan and Trivikram Film Songs Shooting in Chiru Khaidi no 150 Songs Shooted Locations in Europe
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs