Advertisement
Google Ads BL

మొన్న పవన్‌..నిన్న ప్రభాస్‌..నేడు బన్నీ వంతు!


బాలీవుడ్‌లో ఒకటి అరా అట్టర్‌ఫ్లాప్‌ చిత్రాలు తీసి తర్వాత క్రిటిక్‌ ముసుగు వేసుకున్న కమాల్‌ రషీద్‌ ఖాన్‌ గురించి, అతని చెత్త వాగుడు గురించి అప్పట్లో పెద్దగా మనవారికి తెలియకపోయినా 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' విషయంలో పవన్‌ని, నల్లగా ఉన్నాడని రజినీకాంత్‌ని, 1000  కోట్లతో 'మహాభారతం' తీయడానికి రెడీ అవుతున్న మోహన్‌లాల్‌ని చోటా భీమ్‌గా ఆ చెత్త వాగుడు వాడే వాడు నోరు పడేసుకున్న సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చూసిన తర్వాత దీని కంటే మొదటి భాగమే వేయి రెట్లు బాగుందని చెప్పి, ప్రభాస్‌ని ఒంటెతో పోల్చి రానాని కూడా నానా మాటలు అన్నాడు. రానా తన పేరును ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి తొలగించాడనే అవమానంతో రానాతో ఆయన మాటల యుద్దానికి దిగగా, రానా... ఒరేయ్‌ నిన్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది ఇప్పుడు కాదురా... చాలా కాలమే అయింది... అని లాగి చెంపన కొట్టాడు. 

కాగా ఈయన్ను పలువురు బాలీవుడ్‌ మేకర్స్‌ తమ వ్యతిరేకుల, తమతో పాటు రిలీజయ్యే ఇతర చిత్రాల గురించి చెత్తగా మాట్లాడి బ్లాక్‌మెయిల్‌ చేయడానికి వారే డబ్బులిచ్చిఆయన్ను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎదురు దాడి చేయడంతో తోకముడిచాడు. మరలా ఇప్పుడు బన్నీ మీద పడ్డాడు. అల్లు అర్జున్‌ ఫెెయిర్‌ అండ్‌ లవ్లీ జంట్స్‌ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కి అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 

ఆయన ట్వీట్‌ చేస్తూ ఈ రోజు నాకు ఎవరో చెప్పారు. ఈ లుక్కాలు కింగ్‌ ఆలూ తెలుగులో పెద్ద స్టార్‌ అని, బ్రో నువ్వేమైనా చిన్న వేషాలు వేయదలుచుకుంటే బాలీవుడ్‌కి రా...అంటూ వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు. దీంతో అట్టుడికిన మెగాఫ్యాన్స్‌ ఈయనకు దిమ్మతిరిగే షాక్‌లిస్తున్నారు. మరి ఇది ఏ వైపు పయనిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Kamal Rashid Khan Comments on Allu Arjun:

Pawan and Prabhas fans the attack on Kamal Rashid Khan then he is silence. Now again start comments on Allu Arjun.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs