Advertisement
Google Ads BL

నిజమైన గట్స్‌ అంటే ఈ హీరోయిన్‌దే..!


బాలీవుడ్‌లో నటనకు ప్రాధాన్యం ఇచ్చే నటి షబానా ఆజ్మీ ఓ చిత్రం కోసం గుండు కొట్టించుకుంటే అది పెద్ద సంచలన వార్త అయింది. నేటి రోజుల్లో హీరోలు, నటీనటులు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు అందరూ విగ్‌లతో సరిపుచ్చుతున్నారు. తమిళంలో చరణ్‌రాజ్‌, శరత్‌ కుమార్‌ వంటి వారు గుండు కొట్టించుకుంటేనే చాలా మంది థ్రిల్‌గా ఫీలయ్యారు. తాజాగా మరో హీరోయిన్‌ సినిమా వేషం కోసం గుండు కొట్టించుకున్న టాక్‌ ఆఫ్‌ది టౌన్‌ అయింది. 

Advertisement
CJ Advs

ఆమె ఎవరో కాదు.. ప్రముఖ తెలుగు, తమిళ, కన్నడ నటి పూర్ణ. ఈమె తెలుగులో పలు చిత్రాలలో అద్బుతమైన నటనను ప్రదర్శించింది. ఇక స్వతహాగా డ్యాన్సర్‌ కావడంతో స్టెప్స్‌ కూడా బాగా వేసేది. ఇక మన తెలుగు సంగతి చెప్పాలంటే ఆమె చేసిన ఏ చిత్రంలో కూడా ఏ విమర్శకుడు ఆమె నటనకు వంకపెట్టలేదు. సామాన్యులు కూడా ఓకే అన్నారు. కానీ మన తెలుగువారికి కావాల్సింది అది కాదు కదా..! మేకర్స్‌ నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు కేవలం అందాల ఆరబోత, గ్లామర్‌నే పట్టించుకుంటారు కాబట్టి ఆమె నటించిన చిత్రాలేవీ ఓ మోస్తరుగా కూడా ఆడినా మన వారు ఆమెకు చాన్స్‌లు ఇవ్వడం లేదు. 

ఇటీవల మిస్కిన్‌ నిర్మించిన 'సవరకట్టి'లో ఇద్దరు పిల్లల తల్లిగా అద్బుతంగా నటించింది. తనకు ఆ పాత్రను ఇచ్చినందుకు నిండు సభలో ఉద్వేగం ఆపుకోలేక బోరున ఏడ్చింది. ఇక ఆమెకు ఎలాగూ హీరోయిన్‌ అవకాశాలు రావడం లేదు కాబట్టి ఇకపై వాటి ఆశ వదులుకుని, చేసిన, వచ్చిన కొన్ని అవకాశాలనైనా సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్‌ అయింది. తాజాగా ఆమెకు తమిళ దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్‌ హీరోగా నటిస్తున్న 'కొడివీరన్‌'లో బలమైన , నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది. 

పాత్ర రీత్యా దీనికి గుండులో ఉండాల్సి రావడంతో ఎందరు విగ్గులలో మెయిన్‌టెయిన్‌ చేద్దామని వారిస్తున్నా కూడా గుండు కొట్టించుకుని, దానిదేముంది. మంచి పాత్ర లభిస్తే ఎలాగైనా నటించడానికి సిద్దమని ప్రకటించింది. పోనీ ఈ చిత్రంలో ఆమె హీరోయినా అంటే కాదు... హీరోయిన్‌ పాత్రను మహిమా నంబియార్‌ చేస్తోంది. 

Actress Poorna Takes A Bold Head Decision:

Currently, she is working for a movie in which she is going to be seen as a mother for two kids.  she take a bold head decision regarding her role in another film. Actress Poorna is also acting in another Tamil movie titled ‘Kodi Veeran’ in the direction of Muthaiah and is playing a key role.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs