Advertisement
Google Ads BL

చిరు గొప్పతనం చెప్పిన స్టార్‌ కొరియోగ్రాఫర్‌!


ఎందరు ఎన్ని వైవిధ్యమైన స్టెప్స్‌ వేసినా, వాటిని మెగాస్టార్‌ చేస్తేనే ఆ స్టెప్పుకు. సాంగ్‌కు మంచి అందం వస్తుందని అంటారు. ఇక చిరు తన కెరీర్‌లో సలీం, తారల నుంచి రాఘవ లారెన్స్‌, ప్రభుదేవా, వారి సోదరులు, వారి నాన్నతో కూడా పనిచేశారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఆయన తన 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీనెంబర్‌150'లో 'అమ్మడు లెట్స్‌.. డు ..కుమ్ముడు', మిమ్మిమ్మి.. పాటకు కూడా నేటి యంగ్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ నృత్యాలను సమకూర్చాడు. ఇవి ప్రేక్షకులని బాగా ఉర్రూతలూగించాయి. తాజాగా శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ, చిరంజీవి గారి సినిమాలు, పాటలు, స్టెప్స్‌ చూసి పెరిగాను. ఆయనతో పని చేయడం నా అదృష్టం. అంత గొప్ప డ్యాన్సర్‌ అయి ఉండి కూడా మీరేది చెబితే అది చేస్తాను మాస్టర్‌..అనేవారే గానీ ఎక్కడా కనీసం సూచనలు కూడా ఇవ్వలేదు. 

చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌ చరణ్‌లు కలసి చేసిన స్టెప్పునైతే ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ఉవ్విళ్లూరిపోయాను. మరోసారి వారిద్దరితో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. రాకేష్‌ మాస్టార్‌ వద్ద శిష్యరికం చేసిన నాకు 'జులాయి'లోని 'లాయి..లాయి..', 'బాద్‌షా'లో 'నువ్వులేని జీవితం, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌ వంటి పలు హిట్‌ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాను. ప్రస్తుతం రామ్ చరణ్ 'రంగస్థలం 1985', ఎన్టీఆర్‌ 'జై లవ కుశ', రవితేజ 'టచ్‌ చేసి చూడు, రాజా ది గ్రేట్‌', నితిన్‌ కొత్త చిత్రానికి పనిచేస్తున్నానని తెలిపారు. 

Sekhar Master Speaking About Mega Star Chiranjeevi:

The recently Shekhar Master said, Chiranjeevi's movies, songs, and stepes seen grew up. My luck to work with him. If you're a great dancer and even if you say it, I'll do it myself.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs