Advertisement
Google Ads BL

వెంకీ పై వార్తలు నిజమేనా..?


టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌ తన మూడు దశాబ్దాల కాలంలో ఏనాడు వివాదాస్పదుడు కాలేదు. తన తండ్రి దేశం గర్వించదగ్గ నిర్మాత అయినా, స్టూడియో అధినేత అయినా ఆయనలో భేషజాలు ఉండవు. చూడటానికి ముభావంగా కనిపిస్తాడు కానీ ఎదుటి వ్యక్తి నచ్చాడంటే ఎవరు, ఏమిటి? అనే భేషజాలకు పోకుండా ఆధ్యాత్మిక విషయాల నుంచి ప్రతి విషయం ఉదాహరణకు క్రికెట్‌, సినిమా, రాజకీయాలు అన్నీ మాట్లాడుతాడు. 

Advertisement
CJ Advs

కాగా ఆయన తాజాగా సల్మాన్‌ ఖాన్‌ గర్ల్‌ ఫ్రెంఢ్‌గా చెబుతున్న ఐలియా వాంటర్‌తో ముంబైలో కారులో కనిపించాడు. కానీ పలువురు అప్పుడే ఆమెకు,వెంకీకి లింకుపెడుతూ మాట్లాడుతున్నారు.కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం గతంలో 'చంటి'ని 'అనారి'గా, 'యమలీల'ను 'తక్‌దీర్‌వాలా'గా రీమేక్‌ చేసి బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు . అప్పటి నుంచి మరలా ఆయన బాలీవుడ్‌ జోలికిపోలేదు. 

కానీ ప్రస్తుతం ఆయన ముంబైలో ఓ బాలీవుడ్‌ చిత్రం కధా చర్చల్లో పాల్గొంటున్నాడనేది సారాంశం. ఆయన గతంలో కూడా సల్మాన్‌ నాకు సోదరుడి వంటి వాడు. ఆతనితో అవకాశం వస్తే కలిసి నటిస్తానని మాట ఇచ్చాడు. అనుకున్నట్లుగానే సల్మాన్‌తో వెంకీ త్వరలో ఓ చిత్రంలో కలిసి నటించాలని డిసైడ్‌ అయ్యాడట. మన స్టార్స్‌ బహుభాషలను, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌ని టార్గెట్‌ చేయడంతో బాలీవుడ్‌ నటీనటులను కూడా తమ చిత్రాలలో నటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

తాజాగా రజినీ, శంకర్‌ల '2.0'లో కూడా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సల్మాన్‌ దక్షిణాదికి చెందిన ప్రభాస్‌ వంటివారి ముక్కు, మొహం తెలియకపోయిన 'బాహుబలి'ని ఆదరించారని, కానీ తాము దక్షిణాదికి చెందిన వారికి తెలిసినా తమను ఆదరించడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అందులో భాగంగానే దక్షిణాదిలో కూడా సల్మాన్‌ తన చిత్రానికి మంచి క్రేజ్‌ రావాలంటే దక్షిణాది హీరోలతో నటించాలని భావించే ఇలా వెంకీతో కలిసి నటిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. 

మరోవైపు తన దగ్గుబాటి రానాకు బాలీవుడ్‌లో పెరుగుతున్న క్రేజ్‌ దృష్ట్యా మరలా వెంకీ కూడా బాలీవుడ్‌ మూవీలో నటించడాన్ని కొట్టిపారేయలేం. మరోపక్క తెలుగులో 'గురు' తర్వాత వెంకీ ఇప్పటికీ తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి చెప్పకపోవడంతో వెంకీ నెక్ట్స్‌ చేయబోయేది ఓ బాలీవుడ్‌ మూవీనే అని ప్రచారం జోరందుకుంది. 

Victory Venkatesh and Salman Khan Combo Film Soon:

Venkatesh in the past said Salman was like my brother. He promised to work together if he had a chance. After 'Guru' in Telugu, Venky still did not mention his next project Venky is next doing in bollywood movie the campaign.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs