Advertisement
Google Ads BL

తేజ చేసిన రానా పెళ్ళి..!


కండల వీరుడు రానా పెళ్ళి గురించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. దగ్గుబాటి ఫ్యామిలీలో శుభకార్యం నిర్వహించాలనే ఆలోచన ఉంది. బ్రదర్స్ సురేష్ బాబు, వెంకటేష్ ల సంతానానికి పెళ్లి వయస్సు వచ్చింది. త్వరలోనే వెంకటేష్ ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయని సమాచారం.ఇకపోతే 'బాహుబలి' తర్వాత మంచి ఫామ్ లో ఉన్న రానా పెళ్లి గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

అయితే హీరోగా ఇప్పుడే ఎదుగుతున్న రానా తొలుత కెరీర్ పై దృష్టి పెట్టాడు. బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలాడు. ఇప్పుడే సోలో హీరోగా మరోసారి ప్రయత్నిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో నటిస్తున్న 'నేనే రాజు - నేనే మంత్రి' పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇకపోతే ఒక టీవీ షోలో నాగచైతన్య, రానా, సుమంత్ పాల్గోన్నారు. చైతు పెళ్ళి సమంతతో నిర్ణయం జరిగిన విషయం తెలిసిందే. 

'మరి నీ పెళ్ళి ఎప్పుడూ?' అని రానాని చైతు అడిగాడు. దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పలేదు రానా. 'సినిమాల్లో మాత్రం చేసుకుంటున్నావు, నిజ జీవితంలో చేసుకోవా?' అని మరో ప్రశ్న అడిగాడు. దీనిపై స్పందిస్తూ . 'ఇంత వరకు నటించిన చిత్రాల్లో తనపై పెళ్ళి సన్నివేశాలు చిత్రీకరించలేదని, తొలిసారి దర్శకుడు తేజ తనపై పెళ్ళి సీన్ తీశారని' చెప్పుకొచ్చారు. ఇంతకీ పెళ్ళి కూతురు ఎవరంటే ఇంకెవరూ అందాల సుందరి కాజల్. ఆ విధంగా తొలిసారి తెరపై పెళ్ళి కొడుకుగా కనిపించనున్నాడు రానా. 

Rana Married Kajal in 'Nene Raju Nene Mantri':

Daggubati Rana and Kajal Aggarwal starring movie nene raju nene manthri in this movie director by Teja. Rana Kajal married scene planed in nene raju nene manthri movie director Teja.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs