డీజే సినిమా కలెక్షన్స్ పరంగా బాగానే దూసుకుపోతుంది. ఇదే విషయాన్ని డీజే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది కూడాను. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు లైతే ఏకంగా సినిమా విడుదలైన రెండో రోజుకే థాంక్స్ మీట్ అంటూ హడావిడి కూడా చేశారు. మరో పక్క సినిమాకి వెళ్లివచ్చిన వారంతా డీజే సినిమా పై పెదవి విరుస్తున్నారు. ఏదైనా సినిమాని ప్రేక్షకుడు ఒకసారి చూసొచ్చాక మరోసారి చూడాలనిపించేలా ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. కానీ 'డీజే దువ్వాడ జగన్నాథం' ఏమంత గొప్పగా లేదు. ఒకసారి చూడడమే ఎక్కువంటున్నారు ప్రేక్షకులు. ఇక డీజే అభిమానులు కూడా ఈ సినిమా కలెక్షన్స్ మీద ఎక్కడా ప్రచార ఆర్భాటాలు నిర్వహించడంలేదు.
ఇక ఈ సినిమా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగున్నాయనే టాక్ వుంది. అయితే డీజే చిత్రం మొదటి రోజు ఫలితంతో హరీష్ శంకర్ కి మరో అవకాశం ఎవరిస్తారు... డీజే సినిమా పోయిందిగా అని అన్నారు. కానీ వీకెండ్ కలెక్షన్స్ చూసాక హరీష్ కి ఎవరో ఒకరు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పుడు డీజే తర్వాత హరీష్ శంకర్ సినిమా ఏమిటని అందరు తెగ చర్చించేసుకుంటున్నారు. మరి డీజే సక్సెస్ విషయంలో హరీష్ పేరెక్కడా వినబడడంలేదు. అందుకే ఏ హీరో గాని, నిర్మాత గాని హరీష్ తో సినిమా చేసేందుకు కమిట్ అవ్వడం లేదనే టాక్ వినబడుతుంది.
కానీ హరీషేమో నేను నా నెక్స్ట్ సినిమాని తన గత సినిమాలలా కాకుండా కాస్త భిన్నంగా తీస్తానంటున్నాడు. ఈసారి ఖచ్చితంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా.. ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింని చేస్తానని చెబుతున్నాడు. ఇక ఇప్పటికే ఒక థాట్ తన మనసులో ఉందని... ఇక దానికి సరిపడా హీరోని ఎవ్వరిని అనుకోలేదని.. అలాగే ఏ నిర్మాతతో సంప్రదింపులు జరపలేదంటున్నాడు. కథ పూర్తి చేసిన తర్వాతే నటీనటుల ఎంపిక ఉంటుందని చెబుతున్నాడు. చూద్దాం హరీష్ కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో!