ఒకప్పుడు కామెడీ చిత్రాలకు అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రస్‌గా కనిపించాడు. రాజేంద్ర ప్రసాద్ స్థాయిలో కాకపోయినా ఓ రేంజ్‌లో ఓ వెలుగు వెలిగాడు.. ఆయనతో చిత్రాలు నిర్మించేవారు కూడా అతడిని మినిమం గ్యారంటీ కింద లెక్కేసేవారు. యావరేజ్ అయినా కొంచెమైనా లాభాలు ఖాయం. హిట్టుపడితే ఇక కాసుల పండుగే. కానీ ఆ ముహూర్తాన ఆయన 'సుడిగాడు' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చాడో గానీ నాటి నుంచి అతని ఖాతాలో యావరేజ్ చిత్రం కూడా పడలేదు.
నరేష్ అంటే ఆహా ఓహో.. ఇదైనా ఎంటర్‌టైన్ చేయకపోతుందా? అని కోటి ఆశలతో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. ఒకప్పుడు జయాపజాయలతో సంబంధం లేకుండా ఏడాదికి అరడజను చిత్రాలు చేసేవాడు. ఆయన చిత్రాలే ఆయనకు పోటీగా వచ్చేవి. కానీ నేడు ఆ పరిస్థితి రివర్స్ అయింది. ఇక అల్లరోడు కూడా బాగానే ఆత్మపరిశీలన చేసుకున్నట్లు ఉన్నాడు. నేడు స్ఫూప్‌లకి కాలం చెల్లిందని, పేరడీలు రొటీన్ అయిపోయాయంటున్నాడు.
అదే సమయంలో తన క్యారెక్టర్‌లోనే కామెడీ ఉండేలా, ఇతర ఎమోషన్స్‌తో పాటు కామెడీకి ఆ చిత్రం కథలో స్థానం ఉంటేనే వాటిని ఎంచుకుంటున్నానని చెప్పాడు. ప్రస్తుతం తాను చేస్తున్న 'మేడమీద అబ్బాయి' అదే కోవలోకి వస్తుందన్నాడు. ఇక నరేష్‌లో కేవలం కామోడీని మాత్రమే ప్రేక్షకులు చూశారు గానీ ఆయనలో మంచి ఎమోషన్స్ పండించగలిగిన నటుడు ఉన్నాడు. ఇక తనకు మహేష్ 'భరత్ అనే నేను' చిత్రంలో ఓ ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనన్నాడు.
ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఏ విషయం తానే చెబుతానని తెలిపాడు. నిజమే.... మహేష్ 'అర్జున్'లో నటించిన రాజా, 'బాద్షా'లో నటించిన నవదీప్, సిద్దార్ద్, 'నేనులోకల్'లో నటించిన నవీన్ చంద్రలకు ఆ పాత్రలు ఎలాంటి మేలు చేయకపోగా రెంటికి చెడ్డ రేవడిని చేశాయి. కాబట్టి అల్లరోడు జాగ్రత్త పడటంలో తప్పులేదనే చెప్పాలి.