Advertisement
Google Ads BL

మిగిలిన చిత్రాల కంటే ఆ డబ్బింగ్‌ చిత్రమే మేలు!


'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' తర్వాత చాలా చిత్రాలే విడుదలయ్యాయి. వాటిల్లో కేవలం నాగ చైతన్య-కళ్యాణ్‌కృష్ణలో కాంబినేషన్ లో వచ్చిన 'రారండోయ్‌ వేడుకచూద్దాం'మాత్రమే బాగా లాభపడింది. ఆ తర్వాత డజన్ల కొద్ది చిన్న చిత్రాలు వచ్చినా ఆడలేదు. కానీ ఆది పినిశెట్టి నటించగా తెలుగులో డబ్‌ అయి, 'డిజె'కి ముందు ఓ వారం కిందట థియేటర్లలోకి వచ్చిన 'మరకతమణి' మాత్రం బడ్జెట్‌ పరంగా పోల్చుకుంటే నిర్మాతలకు, బయ్యర్లలకు రూపాయికి రూపాయి ఆదాయం సంపాదించి పెట్టిందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ చిత్రాన్ని అనువాద హక్కులను కేవలం 50లక్షలకు కొన్నారు. పబ్లిసిటీకి, ఇతర ఖర్చులు కలిపి మరో 15లక్షలు ఖర్చయ్యాయట. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా కోటి 30లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా శాటిలైట్‌ హక్కులు నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. ఈహక్కులను ఓ శాటిలైట్‌ చానెల్‌ 20లక్షలకు అడుగుతోందని సమాచారం. ఈ విధంగా చూసుకుంటే ఈ చిత్రం నిర్మాతలకు, బయ్యర్లలకు రూపాయికి రూపాయి ఆదాయం తెచ్చినట్లే లెక్క. 

ఇక 'సరైనోడు' తర్వాత ఆది పినిశెట్టి చిత్రాలకు కాస్త ఆదరణ పెరగడం కూడా దీనికి ఓ కారణం. కాగా వచ్చేవారం విడుదల కానున్న నాని 'నిన్నుకోరి'లో కూడా ఆది పినిశెట్టి కీలకమైన పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక 'బిచ్చగాడు' రేంజ్‌లో కాకపోయినా ఆ డబ్బింగ్‌ చిత్రం ఈ స్థాయిలో లాభాలు తేవడం 'బిచ్చగాడు' తర్వాత 'మరకతమణి' అనే అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. 

Marakathamani Movie 1.30Crores Collect in TS and AP States:

Trading sources say that the 'stainer' that came into theaters in the week before the budget has generated the rupee revenue to producers and borrowers compared to budget.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs