Advertisement
Google Ads BL

ముదురుతోన్న దర్శక సినిమాటోగ్రాఫర్ల వైరం..!


సినిమాలో దర్శకుడి తర్వాత ఓ చిత్రం బాగా వస్తుందా? లేదా? అని ముందుగా జడ్జి చేయగలిగేది సినిమాటోగ్రాఫర్. ఆయన కెప్టెన్‌ తర్వాత కెప్టెన్‌ వంటివాడు. దానికితోడు మన హీరోలను డిఫరెంట్‌గా , కలర్స్‌ స్కీమ్‌కు సరికొత్తగా చూపించడంలో వారిదే కీలక పాత్ర. ఇక దర్శకునికి, సినిమాటోగ్రాఫర్ కి సరైన అండర్‌స్టాడింగ్‌ లేకపోతే సినిమా మొత్తం దెబ్బతింటుంది. అందుకే నిన్నమొన్నటి దాకా ఒక్కో దర్శకుడు, ఒక్కో సినిమాటోగ్రాఫర్ కి ఫిక్స్‌ అయ్యేవారు. 

Advertisement
CJ Advs

కానీ నేడు మన హీరోలు డిఫరెంట్‌ సినిమాటోగ్రాఫర్లు కావాలని పట్టుపడుతుండటంతో దర్శకులకి, సినిమాటోగ్రాఫర్లకి మధ్య క్రియేటివ్‌ డిఫరెన్స్‌లు ఎక్కువవుతున్నాయి. 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' సమయంలో జయనన్‌ విన్సెంట్‌ మధ్యలోనే బాబితో పడక వెళ్లిపోయాడు. తాజాగా ఎన్టీఆర్‌ 'జై లవకుశ'కు కూడా మురళీధరన్‌ బై చెప్పాడు.

ఇప్పుడు దిల్‌రాజు -వేణుశ్రీరాం-నానిల 'ఎంసీఏ' (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌)కి కెమెరా మెన్‌గా పనిచేస్తున్న 'కేశవ' సినిమాటోగ్రాఫర్‌ దివకర్‌ మణి కూడా ఎంసిఏ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. వేణు శ్రీరాంతో తాను ఇక పనిచేయలేనని తెలుసుకున్న ఆయన అలా ప్రాజెక్ట్‌ నుంచి వెళ్లిపోయాడట. మరి ఆ స్థానంలోకి ఎవరు వస్తారో వేచిచూడాల్సివుంది....! 

Cinematographer Divakar Mani Dropped in MCA Project:

Now Dilraju-Venu Sriram-Nani's 'MCA'. The camera of 'Camera' Cinematographer Divakar Mani has also been dropped from the MCA project.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs