Advertisement

సోదరుడి గురించి ఓపెన్‌ అయిన రవితేజ..!


ఖచ్చితంగా వారం కిందట రవితేజ సోదరుడు భరత్‌ యాక్సిడెంట్‌లో మరణించాడు. కాగా ఆయన అంత్యక్రియలను కేవలం 1500 రూపాయలు ఇచ్చి ఎవరో జూనియర్‌ ఆర్టిస్ట్‌ చేత చేయించారని, అంత్యక్రియలకు రవితేజ వెల్లలేదని, ఆయన మరునాడే షూటింగ్‌కు హాజరయ్యాడని పలుపలు వార్తలు వచ్చాయి.

Advertisement

తాజాగా ఓ మీడియా వారు రవితేజను ఇంటర్వ్యూలో కోరగా ఆయన మూడ్‌ బాగాలేదు వద్దన్నాడు. కానీ ఆ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా వాళ్లం అయినంత మాత్రాన మాకు ఎమోషన్స్‌ ఉండవా? ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. నాకు చనిపోయిన వారిని చూడటమంటే భయం. శవాలను చూడలేను. ఈ విషయం నాకు దగ్గరగా ఉన్నవారికి తెలుసు. శ్రీ హరిగారు చనిపోయినప్పుడు కూడా అదే ఫోబియా అనుభవించాను. 

తెలిసిన వారి విషయంలోనే ఆలా ఫీలయితే 30ఏళ్లు కలిసి పెరిగిన సోదరుడి మృతదేహాన్ని నేను చూడగలనా? మా దృష్టిలో వాడు బతికే ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడు. ఇక నేను నాన్న, అమ్మల దగ్గర ఉండిపోవడం వల్ల అంత్యక్రియలకు మావారు రాలేదు. కానీ జూనియర్‌ ఆర్టిస్ట్‌ చేత అంత్యక్రియలు చేసేంతటి హీనంగా లేం. మా బాబాయ్‌ ( మా అమ్మ సోదరి భర్త) చేత అంత్యక్రియలు నిర్వహించాం. 

ఆయన ఎవరో మీడియాకు తెలిసి ఉండక పోవచ్చు కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కదా...! జూనియర్‌ ఆర్టిస్టు అని ఏది పడితే అది రాస్తే ఎలా? ఇక నావల్ల షూటింగ్‌ ఆగిపోయి ఇతర ఆర్టిస్టుల డేట్స్‌ వృదా అయితే నిర్మాతలకు ఎంత నష్టమో నాకు తెలుసు. కాబట్టే నిర్మాత మంచి కోసం షూటింగ్‌కు వెళ్లాను, భరత్‌ చివరి బర్త్‌డేని కూడా బాగా చేసుకున్నాం. వాడికి కేక్‌ కట్‌ చేయడం వంటివి ఇష్టం లేదు. 

కానీ ఆ రోజు కేక్‌ కట్‌ చేస్తానన్నాడు. ఇక నా పిల్లలు వాడిని కూడా నాన్నా అని పిలుస్తారు.వారికి బాబాయ్‌ అంటే ప్రాణం.వారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. వాడి ప్రాణాలు తీయడానికే ఆ రాత్రి రోడ్డుపై ఆ లారీ ఆగిపోయి ఉన్నట్లుగా ఉంది అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. 

Ravi Teja is Response About Brother Bharat:

But he would cut the cake that day. My children are also called nanna. They are the life of Babai. They are still crying. He used to say that the lorry was stuck on the road that night.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement