Advertisement
Google Ads BL

బోయపాటితో పక్కా అంట..!


బోయపాటి శ్రీను... 'భద్ర' నుంచి 'సరైనోడు' వరకు ఒకే ధోరణి, తనదైన హీరోయిజంను పీక్స్‌లో చూపించే ఆయన బి.గోపాల్‌, వినాయక్‌ల తర్వాత అంతటివాడుగా పేరు గడించాడు. కానీ ఆయన దర్శకునిగా మారి పుష్కరకాలం కావస్తున్నా ఆయన దర్శకత్వం వహించే చిత్రాలు అరడజను మాత్రమే. ఇక తమ కొడుకును మాస్‌ హీరోగా అదరగొట్టేలా చూపిస్తాడని బెల్లంకొండ సురేష్‌ భావిస్తుంటే 'జయ జానకి నాయకా' అంటూ పొయిటికల్‌ టచ్‌తో, రోమాంటిక్‌ లుక్స్‌తో బోయపాటి ఆశ్చర్యం చెందేలా చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం తర్వాత బోయపాటి చిరు 152 వ చిత్రం కోసం, అదీ గీతాఆర్ట్స్‌ కోసం ఓ కథ రెడీ చేయనున్నాడు. ఆగష్టు మద్యాంతరం కల్లా ఫ్రీ అయ్యే బోయపాటి కనీసం ఆరు నెలలు చిరు కథకు కేటాయించినా చిరంజీవి ఇంకా సురేందర్‌రెడ్డితో 'ఉయ్యాలవాడ' చిత్రం మొదలు పెట్టనే లేదు. దాంతో బోయపాటికి చాలా గ్యాప్‌ వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో నాగ్‌ ఆయనకి ఏకంగా 12 కోట్లు ఆఫర్‌ చేస్తూ తన తనయుడి కోసం స్టోరీ సిద్దం చేయమని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

కాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి ఏకంగా 10కోట్లే ఎక్కువ అనుకునే సమయంలో ప్రతిది క్యాలిక్యులేటెడ్‌గా వెళ్లే నాగ్‌ స్వయంగా 12కోట్లు ఆఫర్‌ చేయడమంటే మాటలు కాదు. ఇక అక్కినేని అఖిల్‌ తన విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మూవీపైనే ఉండటంతో బోయపాటి చేయబోయేది అఖిల్‌తో కాదని, 'తడాఖా' తర్వాత మరలా మాస్‌ హీరోగా ఎదగాలని భావిస్తున్న నాగ చైతన్య కోసమే నాగ్‌ బోయపాటికి కబురు పంపాడని తెలుస్తోంది. రారండోయ్‌ వేడుక చూద్దాం.. ద్వారా క్లాస్‌ ఆడియన్స్‌ని వరుసగా మెప్పిస్తూ వస్తున్న నాగ చైతన్యకు మాస్‌ ఇమేజ్‌ తేవడానికే ఇది అని అర్దమవుతోంది. 

Boyapati Sreenu Movie With Naga Chaitanya:

Nag has been offered a Rs 12 crore offer to Boyapati Sreenu tell him to get the story ready for his Son.  Nag was sent to Boyapati Sreenu for Naga Chaitanya.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs