Advertisement
Google Ads BL

'డిజె' దరువుకు ఆలస్యం ఎందుకు..?


అల్లు అర్జున్‌ నటించిన 'డిజె' చిత్రం నెగటివ్‌ టాక్‌లో కూడా ఆల్‌రెడీ 100కోట్లు కలెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్‌కు మలయాళంలో భారీ ఫ్యాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో చాలా మంది ఆయన్ను అల్లు అర్జున్‌ అని కాకుండా మాలీవుడ్‌ అర్జున్‌ అని పిలుస్తుంటారు. ఆయన నటించి పెద్దగా ఇక్కడ ఆడని 'బద్రినాథ్‌' వంటి చిత్రం కూడా మలయాళంలో బాగా ఆడింది. 

Advertisement
CJ Advs

తమదైన ఆర్ట్‌ ఫిలిం వంటి వాటిపై వారికి మొహం మొత్తంతో సినిమా టిక్‌గా, డ్యాన్స్‌లు, ఫైట్స్‌, స్టెప్పులతో ఉండే బన్నీ చిత్రాలకు ఆక్కడ ఆదరణ బాగా ఉంటుంది. ఆయన కిందటి చిత్రం 'సరైనోడు'కి అక్కడి రివ్యూలు కూడా తక్కువ రేటింగే ఇచ్చినా 'యోధవు' పేరుతో రిలీజ్‌ అయిన 'సరైనోడు' కూడా అక్కడ సూపర్‌ కలెక్షన్లు సాధించింది. కాగా ఎంతకాలంతోనే మలయాళ వాసులు బన్నీని పంచెకట్టులో చూడాలని కోరుతున్నారు. 

వారి కోరికను 'డిజె' ద్వారా తీర్చినట్లు ఈ చిత్రం విడుదలకు ముందు తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బన్నీ చెప్పాడు. కాగా 'డిజె' చిత్రాన్ని ఈనెల 14న కేరళలో రిలీజ్‌ చేయనున్నారు. 'డిజె' తెలుగు రిలీజ్‌ సందర్బంగా అదే తేదీన మలయాళంలో విడుదల చేస్తే ఇక్కడ ప్రమోషన్స్‌కి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల మలయాళంపై పెద్దగా దృష్టి పెట్టే చాన్స్‌ ఉండదని భావించిన బన్నీ మూడు వారాల ఆలస్యంగా రిలీజ్‌ తేదీని ఫైనల్‌ చేశాడు. 

ఇక బన్నీ గత చిత్రాలు మలయళంలో డబ్‌ అయినప్పటికీ వాటి అనువాదంతో తొలుత కొన్ని చిత్రాలకు డబ్బింగ్‌ సింక్‌ కాలేదు. దీంతో 'డిజె' చిత్రానికి మలయాళం కోసం మంచి డబ్బింగ్‌ రచయితలను పెట్టి అనువాదం చేయిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌కి కూడా బన్నీ స్వయంగా వెళ్లి ఓ వారం రోజులు దానికే టైం కేటాయించనున్నట్లు సమాచారం. 

DJ Duvvada Jagannadham Malayalam Version's Date Set:

Team DJ has planned a grand release of the movie on July 14 aiming at record collections among Allu Arjun's films. With the inclusion of Malayalam version's collections, the film's total collections will be zoomed upto another level. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs