Advertisement
Google Ads BL

అఖిల్ అలాంటివి వద్దంటున్నాడు..!


సినిమా హీరోలకు తమ తమ అభిమానులు పేర్లకు ముందు బిరుదులు తగిలించి ముద్దుగా పిలుచుకుంటారు. కేవలం అభిమానులే కాదు కొంత మంది డైరెక్టర్ కూడా హీరోల మీద ఉన్న అభిమానంతో హీరోల పేర్ల ముందు ఆ బిరుదుని తగిలించి ఆనందించడమే కాదు టైటిల్స్ లో కూడా వేసేస్తుంటారు.  ఈ ట్రెండ్ ఒక టాలీవుడ్ లోనే కాదు అన్ని వుడ్స్ లోను వుంది. టాలీవుడ్ లో మెగాస్టార్ అని చిరుని పిలిస్తే, కోలీవుడ్ లో రజినీకాంత్ ని సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. ఇక బాలీవుడ్ అమితాబ్ ని మెగాస్టర్, సూపర్ స్టార్ అని సంబోధిస్తూ వుంటారు అభిమానులు.

Advertisement
CJ Advs

ఇక టాలీవుడ్ సీనియర్ హీరోస్ అయిన నాగార్జునని యువ సామ్రాట్ అని, వెంకటేష్ ని విక్టరీ వెంకటేష్ అని,  నటసింహం అని బాలకృష్ణకి బిరుదులూ వున్నాయి. ఇక యంగ్ హీరోస్ అయిన ఎన్టీఆర్ కి యంగ్ టైగర్ అని , రామ్ చరణ్ కి మెగా పవర్ స్టార్ అని, పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. ఇంతగా ఇపుడు ఈ బిరుదుల గొడవ ఎందుకు వచ్చింది అంటే నాగార్జున కొడుకు అఖిల్ కి అప్పుడే అభిమానులు ఒక బిరుదు ఇచ్చేశారట. నాగ్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన అఖిల్ ని అక్కినేని అభిమానులు  నవ సామ్రాట్, నవ మన్మథుడు అంటూ మొదలెట్టేశారు. మరి టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి ఒకే ఒక్క సినిమాలో నటించిన అఖిల్ కి అపుడే బిరుదు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

ఇక అఖిల్ కూడా  ఇలాంటి బిరుదులు మాత్రం తనకు తగిలించొద్దని అంటున్నాడు. నా పేరుకు ముందు ఇలా నాకు బిరుదులూ ఏవీ తగిలించకండి. ఇలాంటి ట్యాగ్స్ తో పిలుస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. అవన్నీ సూపర్ స్టార్స్ కు ఉంటాయని నాకు తెలుసు. నేను కేవలం అప్ కమింగ్ యాక్టర్ ని మాత్రమే అంటూ అభిమానులకు స్వీట్ గా సింపుల్ గా చెప్పాడు అఖిల్.

Akkineni Akhil is Not Interest on Nickname:

Nagarjuna's son Akhil has been giving fans a nickname. Akhil, who entered the Tollywood as the successor of Nag, started his fans nickname as Nova Samrat and Nav Manmad.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs