Advertisement
Google Ads BL

గెస్ట్ గా బాలయ్య వస్తున్నాడు..!


ఒక చిత్రానికి పెద్ద హీరోల ప్రమోషన్‌ ఉంటే అది ఆ చిత్రానికి బిజినెస్‌ పరంగానే కాకుండా ఓపెనింగ్స్‌ విషయంలో కూడా మంచి ఊపు వస్తోంది. తాజాగా పలు చిన్న మద్యతరగతి హీరోల చిత్రాలకే కాదు.. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌కి కూడా పెద్ద హీరోల ప్రమోషన్‌తో పాటు రాజమౌళి నుంచి సుకుమార్‌ వరకు ప్రశంసలు అందుకుంటూ విడుదలకు ముందుగానే మంచి క్యూరియాసిటీని పెంచుతున్నాయి. 

Advertisement
CJ Advs

కాగా ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త ఆనంద్‌ప్రసాద్‌ నిర్వహణలోని భవ్యఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఇటు బాలయ్య -పూరీ జగన్నాథ్‌ ల కాంబినేషన్‌లో 'పైసా వసూల్‌' అనే భారీ చిత్రాన్నినిర్మిస్తోంది. అదే సమయంలో నారారోహిత్‌, సందీప్‌కిషన్‌, సుదీర్‌బాబు, ఆది, సాయికుమార్‌లు వంటి నలుగురు యంగ్‌ హీరోల కాంబినేషన్‌లో ఓ కామెడీ క్రైం థ్రిల్లర్‌గా 'శమంతకమణి'ని కూడా భవ్యఆర్ట్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా 'భలే మంచిరోజు' దర్శకుడు శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ నుంచి టీజర్‌, ట్రైలర్‌ వరకు పలువురిని విడుదలకు ముందే ఆకర్షిస్తోంది. ఇందులో 'శమంతకమణి' అనేది ఓ ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారు అని, ఓ హైదరాబాద్‌లోని ఖరీదైన ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు అర్దమవుతోంది. 

ఇక ఇందులో నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌ కూడా ఓ మంచిపాత్రను చేస్తున్నాడు. ఒకరిద్దరు హీరోలనే కలిపి నటించడానికి ఓప్పించలేకపోతున్న ఈ రోజుల్లో ఏకంగా నలుగురు అప్‌కమింగ్‌ హీరోలు ఇందులో నటిస్తున్నారంటే సమ్‌థింగ్‌ ఈజ్‌ దేర్‌ అనిపిస్తోంది.ఇక 10కోట్లలోపు రూపొందిన ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులు ఇప్పటికే 2.5కోట్లకు, ఆంధ్రా బిజినెస్‌ 5కోట్లదాకా జరుగుతున్నదట. కాగా జూలై 3 జరిగే ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి బాలకృష్ణ, పూరీజగన్నాథ్‌లు రానున్నారు. దాంతో ఈ చిత్రానికి మరింత హైప్‌రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Balayya and Puri are the Shamantakamani Pre Release Event Guests:

<span>After releasing Shamantakamani Trailer on YouTube. The makers of the movie, Bhavya Creations will be hosting a movie pre-release function on 3rd July 2017</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs