తన కెరీర్‌లో ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలలో ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు 'సముద్రం, గాయం, అంత:పురం' వంటి మాస్ ఓరియంటెడ్ పాత్రలు కూడా చేసి మెప్పించాడు. ఇక ఆయన తనదైన మాస్ చిత్రాలు చేసే విషయంలో కేవలం సముద్ర, జొన్నలగడ్డ శ్రీనివాస్ వంటి పెద్దగా టాలెంట్ లేని దర్శకులతోనే ఎక్కువ చేయడం వల్ల మాస్ హీరోగా ఆయన క్రేజ్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు. కానీ సరైన మాస్, అండ్ యాక్షన్ దర్శకుని చేతిలో పడితే మాత్రం తన ఫిజిక్, తీక్షణపు చూపులకు ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటాడనేది నిజం.
ఇక ఫ్యామిలీ హీరోల కెరీర్‌లకు పెద్దగా లాంగ్‌రన్ లేని కారణంగా ఆయన బోయపాటి సలహాతో 'లెజెండ్'లో బాలయ్యకు పోటాపోటీగా విలన్‌గా చేసి మెప్పించాడు. ఇక అక్కడి నుంచి ఆయన విలన్‌గా, తండ్రి వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో తెలుగులోనే కాదు, తమిళ, మలయాళంలో కూడా బిజీ బిజీగా ఉన్నాడు. తాను హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే చాలా బిజీగా ఉన్నానని, ఫైనాన్షియల్‌గా బాగుందని చెబుతున్నాడు.
ఈ వయసులో ఆయన అమితాబ్, మోహన్‌లాల్, మమ్ముట్టి తరహా వెరైటీ కథలను ఎంచుకుంటే మరింత లాంగ్ రన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 'లెజెండ్'లో క్లిక్ అయ్యాడని అలాంటి పాత్రలు, శ్రీమంతుడులో బిజినెస్‌మేన్‌గా, హీరో తండ్రిగా అలాంటి పాత్రలే వస్తున్నాయి. దాంతో ఆయన హీరోగా రఫ్ అండ్ స్టైల్‌గా రూపొందుతున్న 'పటేల్‌సార్' ఫస్ట్ లుక్ సూపర్బ్‌గా ఉంది. లాంగ్ డ్రైవ్‌కి వెళ్తూ.. బ్లాక్ బైక్, బ్లాక్ జాకెట్‌తో ఆయన పిచ్చ పిచ్చ రఫ్‌గా కొత్తగా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉన్నాడు.
వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటితో పాటు ఆయన కూడా భాగస్వామిగా ఇది రూపొందుతోంది. థీమ్ టీజర్‌తోనే బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఈనెలలో విడుదలకు ముస్తాబవుతోంది. చెడుకు, చెడుకు జరిగే పోరాటంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, ఓపాపకి, ఆయనకు మద్య ఉండే ఓ ఎమోషనల్ టచ్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మొత్తానికి ఈ చిత్రం హిట్టయితే మాత్రం మరిన్ని విభిన్న చిత్రాలను జగ్గూభాయ్ నుంచి తప్పక ఆశించవచ్చు.