Advertisement
Google Ads BL

పవన్ 'లబ్బర్‌సింగా' లేక 'గబ్బర్‌సింగా'..??


ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని, ప్రభుత్వాలు తప్పులు చేస్తే సామాన్యుల తరపున వారిని కడిగేస్తానని చెప్పిన జనసేన నాయకుడు పవన్‌కళ్యాణ్‌.. సమస్యలపై ఎందుకు పోరాడటం లేదని వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ రోజా మరోసారి పవన్‌ని టార్గెట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానన్నాడని, సంతోషమే కానీ ఆ మొనగాడు, మగాడు ఇప్పుడు ఎక్కడా? అంటూ ఆమె విమర్శలకు పదునుపెట్టారు. 

Advertisement
CJ Advs

ఒకపక్క కాపులు రిజర్వేషన్ల కోసం ఆందోళనలో ఉండి, తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ చేస్తుంటే పవన్‌ మౌనంగా ఉండటం అంటే ఏమనుకోవాలి? అని మరోసారి కాపు మంట రగిల్చి, పవన్‌ని ఆమె ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు. పవన్‌ చేనేత పరిశ్రమకు బ్రాండ్‌ అంబాసిడర్‌ని అని అంటున్నాడని, మరి జీఎస్టీ వల్ల చేనేత వస్త్రాల ధరలు పెరిగి, చేనేత కార్మికులకు మాత్రం అన్యాయం జరుగుతుంటే ఆయన నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ప్లీనరీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తాను 'లబ్బర్‌సింగ్‌'నా లేక 'గబ్బర్‌సింగ్‌'నా అనేది తేల్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలను విసిరారు. మరి ఈ విషయంలోనైనా పవన్‌ స్పందిస్తాడా? లేక మౌనాన్నే ఆశ్రయిస్తాడా? దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జీఎస్టీపై ఆయన వైఖరి ఏమిటి? అనేది ఆసక్తిని కలిగిస్తోంది...! 

Roja Sensational Comments on Pawan Kalyan:

YCP MLA Roja made sensational comments on Janasena chief Pawan Kalyan in a press meet at YCP plenary meet held in Kakinada.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs