Advertisement
Google Ads BL

అబ్బో.. బోయపాటిలో ఈ యాంగిల్‌ కూడానా!


మాస్‌, పవర్‌ఫుల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను. బి.గోపాల్‌, వినాయక్‌ల తరహాలోనే ఈయన హీరోయిజంను పీక్స్‌లో చూపిస్తాడు. కాగా ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు11న ఈ చిత్రం విడుదల కానుంది. మరోపక్క అప్పుడెప్పుడో వచ్చిన ప్రీలుక్‌ కి స్పందన బాగానే వచ్చింది. 

Advertisement
CJ Advs

కానీ బోయపాటి ఈ చిత్ర టైటిల్‌ను, లోగోను చూసి  ఆందరూ షాక్‌ అయ్యారు. కాస్త రొమాంటిక్‌, పొయిటిక్‌ టచ్‌తో 'జయ జానకి నాయక' అనే టైటిల్‌ పెట్టి ఆశ్చర్యపరిచాడు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. హిల్‌ స్టేషన్‌ వంటి ప్రాంతంలో ఆగివున్న బైక్‌ని ఆనుకుని రకుల్‌ ఉంటే, రోడ్డుమీద కూర్చొని ఆమెకు ఏదో సాయిశ్రీనివాస్‌ చూపిస్తున్న లుక్‌ ఎంతో ప్లెజెంట్‌గా ఉంది. 

దీంతో ఈ చిత్రంలో లవ్‌, రొమాన్స్‌తో పాటు తన మార్క్‌ హీరోయిజాన్నిచూపిస్తునే ఫ్యామిలి ఎమోషన్స్‌ మిక్స్‌ చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిలకు బోయపాటి మంచి బ్రేక్‌నిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Jaya Janaki Nayaka First Look Talk:

Jaya Janaki Nayaka first look poster is truly promising with a pleasant romantic tinge.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs