Advertisement
Google Ads BL

అంత అంటే తెలుగులో 2.0 కష్టమే..!


ఇండియా మొత్తంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టపడే వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన గత సినిమాలు ఎన్ని ప్లాపయినప్పటికీ... రజిని  సినిమా విడుదలవుతుంది అంటే ఆ క్రేజే వేరు. ఇక డైరెక్టర్ శంకర్ విషయము అంతే. ఆయన గత సినిమాలు ఎన్ని ప్లాపైనా కూడా శంకర్ సినిమా వస్తుంది అంటే అందరూ ఇంట్రెస్ట్ చూపించేస్తారు. మరి అలాంటి శంకర్ - రజిని కాంబినేషన్ లో మూవీ వస్తుంది అంటే హడావుడి మాములే. ఇప్పటికే రోబో పార్ట్ 1 తో సంచలనాలను క్రియేట్ చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు 2.0 తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చేస్తున్నారు. ఈ  2.0 లో మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం ఒకటైతే బ్రిటన్ సుందరి అమీ జాక్సన్ రజినీకాంత్ కి జోడిగా నటించడం మరొక విశేషం.

Advertisement
CJ Advs

మరి విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఇక గ్రాఫిక్ వర్క్ కి, విజువల్ ఎఫెక్ట్ కి సంబంధించిన పనుల కోసం ఏకంగా ఆరు నెలలు టైం తీసుకున్న 2.0  టీమ్ ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. అలాగే 2.0 కి సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ టూర్ చేస్తున్న చిత్ర టీమ్ అప్పుడే 2.0 పబ్లిసిటీని ఆకాశంలో మొదలెట్టేసింది. అలాగే దీపావళికి 2.0 టీజర్ విడుదల చేసి రజిని పుట్టినరోజు కానుకగా ట్రైలర్ ని విడుదల చెయ్యాలని టీమ్ ప్లాన్ చేస్తుందట.

ఇక భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర బిజినెస్ ని అప్పుడే మొదలెట్టేశారని టాక్ వినబడుతుంది. అందులో భాగంగానే రోబో 2.0  చిత్ర తెలుగు రైట్స్ ని నిర్మాతలు హోల్ సెల్ గా అమ్మేయాలని చూస్తున్నారట. కానీ 2.0 నిర్మాతలు తెలుగు వెర్షన్ ఒక్కదానికే 100 కోట్లకి పైగా బేరం చెబుతున్నారట. మరి బాహుబలి సినిమాకి జరిగినట్టు 2.0  కి కూడా ఆ లెక్కలోనే బిజినెస్ జరుగుతుందని 2.0 నిర్మాతలు భావించే ఇంత రేటు చెబుతున్నారట. కానీ అంత పెద్ద మొత్తం చెల్లించేందుకు  తెలుగు నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారట. 

మరి వారు చెప్పిన రేటుకు 2.0 హక్కులు కొనాలంటే ఈ చిత్రం ఎంతగా వసూళ్లు రాబట్టలో కదా. అందుకే ఈ చిత్రాన్ని హోల్ సెల్ గా కొనకుండా కేవలం డిస్ట్రిబ్యూషన్ తో సరిపెట్టాలని చూస్తున్నారట. మరి 50 నుండి 60 కోట్లకు అడ్వాన్స్ మాట్లాడుకుని పంపిణీ చేసేయాలని చూస్తున్నారట టాలీవుడ్ బడా నిర్మాతలు. అయితే అందరిలో ఎక్కువగా 2.0 మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నది మాత్రం సాయి కొర్రపాటి అని చెబుతున్నారు. మరి ఎవరు ఫైనల్గా 2. 0  ని చేజిక్కిన్చుకుంటారో చూద్దాం.

Rajinikanth and Shankar 2.0 Telugu Version Rights:

Sai Korrapati eye on Rajinikanth and Shankar's 2.0 Telugu Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs