రెండు నెలలు వీరవిహారం చేసిన 'బాహుబలి 2' కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల లాంగ్‌రన్ అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమాకు కలెక్షన్ల రికార్డులైతే ఉన్నాయి కానీ, వంద రోజుల ప్రదర్శన రికార్డ్ మాత్రం దక్కడం లేదు. హైదరాబాద్ మెయిన్ థియేటర్ సుదర్శన్ 35లో 63 రోజులకు ఎత్తేశారు. శుక్రవారం నుండి గంటా రవి హీరోగా నటించిన 'జయదేవ్' సినిమా ప్రదర్శనకు బాహుబలి థియేటర్ ఖాళీ చేశాడు.