వాస్తవానికి బన్నీకి, దిల్‌రాజుకు, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న చిత్రాలకి ఓవర్‌సీస్‌లో మంచి ఆదరణ ఉంటుంది. 'డిజె' చిత్రం అమెరికాలో ఓ మోస్తరు కలెక్షన్లు వసూలు చేస్తున్నా కూడా మిలియన్ మార్క్ దగ్గరగా ఉంది అంతే. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో మిలియన్ తప్పనిసరి అని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు హైరానా పడుతున్నారు. మొదటి వీకెండ్ ముగిసింది.
ఇక ఎల్లుండి నుంచి సెకండ్ వీకెండ్‌లో కూడా స్ట్రాంగ్‌గా ఉంటేనే యూఎస్‌లో 'డిజె' సేఫ్ అవుతుంది. దీంతో 'డిజె' యూనిట్ రేపు యుఎస్‌లో అడుగుపెట్టనుంది, మరోపక్క నెగటివ్ రివ్యూలకు తోడు, యాంటీ ఫ్యాన్స్ నెగటివ్ పోస్ట్‌లు, నెగటివ్ కామెంట్లతో సోషల్‌మీడియా హోరెత్తుతోంది. ఏకంగా సినిమాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, యూనిట్ సైబర్‌క్రైమ్ కి రిపోర్ట్ చేయడం జరిగిపోయాయి.
ఆ పని చేసిన వారిని అరెస్ట్ చేయడమే తరువాయి. కానీ యూనిట్‌లోని ముఖ్యులందరూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద థియేటర్లలో బన్నీ కనిపిస్తే మరలా ఓవ్‌ర్‌సీస్ ప్రేక్షకులు బన్నీ కోసం థియేటర్లకు పోటెత్తుతారని యూనిట్ భావన, మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాలలోని నిరసనలను ఎవరు ఆపుతారు? అనేది ఆసక్తికరం.