Advertisement
Google Ads BL

శృతి, అనుష్క, నయన్...ఇప్పుడు హన్సిక..!


కోలీవుడ్లో అతి పెద్ద ప్రాజెక్ట్ అంటూ డైరెక్టర్ సుందర్ సి మొదలు పెట్టిన 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ కి ఆది నుండే ఆటంకాలు మొదలయ్యాయి. 'సంఘమిత్ర' చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో లాంచ్ చేసి సెట్స్ మీదకెళ్లే సమయానికి 'సంఘమిత్ర' టైటిల్ రోల్ పోషించే శృతి హాసన్ హ్యాండ్ ఇవ్వడంతో మొదలైన కష్టాలు ఇప్పటివరకు ఒక కొలిక్కిరాలేదు. ఆ రోల్ నుండి శృతి హాసన్ తప్పుకున్నాక ఆ కేరెక్టర్ కోసం అరడజను మంది హీరోయిన్స్ పేర్లు వినబడినాయి. కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని ఫైనల్ చెయ్యలేదు 'సంఘమిత్ర' టీమ్. ఇప్పటికి ఆ కేరెక్టర్ కోసం పలువురు హీరోయిన్స్ పేర్లు వినబడుతూనే వున్నాయి కూడా.

Advertisement
CJ Advs

ముందుగా 'బాహుబలి'లో దేవసేనగా మెప్పించిన అనుష్కని అనుకున్నారు. అలాగే బాలీవుడ్ భామ 'బాజీరావ్ మస్తానీ'లో మెప్పించిన దీపికా  పదుకొనె అని ఒకసారి. కాదు కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార అని ఒకసారి, కాదు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం వున్న నీతూచంద్ర అని అబ్బో చాలామంది లిస్ట్ ఈ కోవలో వుంది. కానీ మొన్నటికి మొన్న నయనతార పేరు బలంగా వినబడి ఫైనల్గా సెట్ అయ్యిందని కూడా అన్నారు. కానీ ఇప్పుడు పాల బుగ్గల హన్సిక పేరు కొత్తగా తెరమీదకొచ్చింది. కారణం సుందర్ సి కి హన్సిక బాగా క్లోజ్  కావడం, సుందర్ భార్య  కుష్బూ తో హన్సికకు సన్నిహిత సంబంధాలు ఉండడం వంటి విషయాలతో 'సంఘమిత్ర' టైటిల్ రోల్ హన్సిక చేసే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇకపోతే 'సంఘమిత్ర' టైటిల్ రోల్ కి  బాహుబలిలో కత్తి తిప్పిన అనుష్క అయితే బెటర్ అని.... లేకుంటే మార్షల్ ఆర్ట్స్ లో చెయ్యి తిరిగిన నీతూ చంద్ర అయినా ఓకె అని... ఇక లేడి ఓరియెంటెడ్ మూవీస్ తో పేరు తెచ్చుకుంటున్న నయనతార అయినా పర్లేదుగాని.... ఈ హన్సిక అయితే 'సంఘమిత్ర' టైటిల్ రోల్ కి ఏ మాత్రం న్యాయం చేయగలదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన హన్సిక 'సంఘమిత్ర' లాంటి సీరియస్ పాత్రకు ఏం న్యాయం చెయ్యగలదనే ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు కొంతమంది. మరి హన్సిక కూడా ఈ రోల్ చెయ్యకపోతే ఫైనల్ గా ఎవరు చేస్తారనే దానిమీద మళ్ళీ సస్పెన్సు కంటిన్యూ అవుతుంది.

Hansika Motwani for Sanghamitra?:

Apple beauty Hansika Motwani is offered the title role in Sundar C directorial Sanghamitra! This has been a big subject in South film circles ever since Shruti Hasan is shown the exit door.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs