Advertisement
Google Ads BL

పూజా హెగ్డే కి అదృష్టం పట్టేసింది..!


ఒక్క సినిమా పూజ హెగ్డే జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమాలో ఆమె కేరెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ ఆమె అందాల ఆరబోతకు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఆ చిత్రం మరేదో కాదు అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం'. పూజ ఈ చిత్రంలో వీరలెవల్లో అందాల ఆరబోసి బికినీతో అందరిని పడేసింది. పొట్టి నిక్కర్లతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. మరి డీజే లో పూజ గ్లామర్ ఒక రేంజ్లో చూపించేసింది. 'ముకుందా, ఒక లైలా కోసం' లో అస్సలు గ్లామర్ అంటే ఏమిటో తెలియని అమ్మాయిలా కనబడిన పూజ ఇక్కడ డిజెలో మాత్రం మితిమీరిన అందాల ప్రదర్శన చేసి మంచి పేరుతోపాటే ఛాన్సులు కొట్టేస్తుంది.

Advertisement
CJ Advs

అసలు డీజే లో పూజ అందాన్ని పొగిడే అవకాశం మనకు వచ్చేదే కాదంట. ఎందుకంటే పూజ టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్ పక్కన మోహింజదారోలో ఛాన్స్ కొట్టేసి అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ చేసింది. అక్కడ అమ్మడుకి అదృష్టం వరించక ఆ సినిమా ప్లాప్ అవడంతో గమ్మునుండిపోయింది. కానీ తెలుగులో వచ్చే అవకాశాలను మాత్రం బాలీవుడ్ కోసం వదులుకుంటూనే ఉందట. ఎలాగైనా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనతో ఇలా సౌత్ అవకాశాలు వదులుకోవడం మంచిది కాదని ఎవరో చెబితేనే పూజ డీజే ఆఫర్ కి ఒప్పుకుందట. మరి ఈ ఒక్క డీజీతోనే పూజ స్టార్ ఎలా తిరిగిందో చూశారూ..

ఇక ఇప్పుడు తాజాగా శ్రీవాస్ డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా ఎంపికైన ఈ భామ ఈ చిత్రం కోసం కోటి కొట్టేస్తుంది. మరి డీజే కి 70  లక్షలతోనే సరిపెట్టుకున్న ఈ భామ ఆ సినిమాతోనే తన రెమ్యునరేషన్ తెగ పెంచేసిందట. అలాగే మహేష్ బాబు సరసన కూడా వంశీ పైడిపల్లి చిత్రంలో పూజ హెగ్డే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా డీజే తో పూజ కి మాత్రం అదృష్టం బాగా పట్టేసింది.

Pooja Hegde Heroine In Bellamkonda Sai Sreenivas Film:

Glamour doll Pooja Hegde is officially confirmed as heroine for Bellamkonda Sai Sreenivas in new movie under Sriwaas direction to be produced on Abhishek Pictures banner of Nama Abhishek. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs