Advertisement
Google Ads BL

కమల్‌ దిగి వచ్చాడు..!


ఒకప్పుడు లోకనాయకుడు కమల్‌ హాసన్‌ సినిమా వస్తోందంటే చాలు.. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షించేవారు. దేశం మొత్తం ఇలాగే ఉండేది. కానీ 'దశావతారం', ఆ తర్వాత 'విశ్వరూపం' మాత్రమే ఫర్వాలేదనిపించాయి. 'ఈనాడు, ఉత్తమవిలన్‌' నుంచి అన్నీ బాదుడు కార్యక్రమాలే. ఇక ఆయన ఇప్పుడు మూడు సినిమాలపై వర్కౌట్‌ చేస్తుండటంతో ఒక్కటి ఫలితం తేల్చేలా లేదు. 'శభాష్‌నాయుడు' అని ఫారిన్‌ వెళితే డైరెక్టర్‌కి తీవ్ర అనారోగ్యం. 

Advertisement
CJ Advs

దాంతో తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. మధ్యలో ఆయన గాయపడి ఇంటికే పరిమితం. 'శభాష్‌నాయుడు' పరిస్థితి ఏందో తెలియదు. ఇక 'విశ్వరూపం2' ఇదే ఏడాది విడుదల అని పోస్టర్స్‌ వచ్చాయి. పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు విదేశాలలో చేస్తున్నామన్నారు. ఆస్కార్‌ రవిచంద్ర చేతులెత్తేశాడు.దానిని కూడా తన భుజాలకెత్తుకున్నాడు కమల్‌. కానీ 'విశ్వరూపం2'లో ఇంకా 25శాతం షూటింగ్‌ను చేయాల్సివుందని, రీషూట్స్‌ కూడా అవసరమని, ఈ చిత్రం ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలే లేవంటున్నారు. 

కాగా నేటితరంకి ముందు తరంవారికి కమల్‌ బ్రిటన్‌రాణి ఎలిజబెత్‌ని ఆహ్వానించి మరీ గ్రాండ్‌గా ఓపెనింగ్‌ చేశాడు. షరామమూలే.. కొద్ది రోజులకే ఆర్దిక ఇబ్బందులు. దీంతో తాజాగా కమల్‌ని ఓ విలేకరి 'మరుదనాయగం' సంగతేంటి? అని ప్రశ్నించి వెండి తెరపైకి ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్నిస్తే ఏమో వెబ్‌ సిరీస్‌గానైనా రావచ్చు. టీవీ సీరీస్‌గానైనా రావచ్చని సెలవిచ్చాడు.అంటే బడ్జెట్‌ని పరిమితం చేసి మరుదనాయగంను ఓ వెబ్‌సీరీస్‌ లేదా టీవీ సీరీస్‌లా తెచ్చేయోచనలో కమల్‌ ఉన్నట్లున్నాడు. 

Kamal Haasan is Come down:

Kamal is a reporter for the question 'Marudanaayagam'? When will come to the screen? Ask yourself Kamal Haasan said web series may come. The TV series might come up.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs