మేర్లపాక గాంధీ.. ఆమద్య వరుసగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజాలు రెండింటిని హిట్లుగా మలిచి ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించాడు. కానీ అంత మంచి హిట్లు ఇచ్చినా కూడా ఆయన తన మూడో సినిమా కోసం చాలా కాలమే వెయిట్ చేయాల్సి వచ్చింది. 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రం హిట్టవ్వగానే హీరో శర్వానంద్ మెగా ఫ్యామిలీతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని మేర్లపాక గాంధీ చేత రామ్ చరణ్‌కి ఓ కథ చెప్పించాడు. ఈ చిత్రం ఓకే అయిందని కూడా వార్తలు వచ్చాయి.
కాగా ప్రస్తుతం ఆయన నానికి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. మేర్లపాక గాంధీ మూడో చిత్రంగా రానున్న ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్నాడు. గతంలో నాని 'జెండాపై కపిరాజు, జెంటిల్‌మేన్'లలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ కథ నాడు గాంధీ చరణ్ కోసం తయారు చేసుకున్న కథేనని తెలుస్తోంది. కాగా గాందీ చిత్రంలో ఓ పాత్ర పక్కా మాస్ కాగా, మరోటి క్లాస్‌గా ఉంటుందట. సో..దీనిని నానికి తగ్గట్లుగానే స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసి, నానిని ఎలాగూ క్లాస్ ఇమేజ్ ఉంది కాబట్టి రెండో పాత్రను 'నేనులోకల్'కంటే పక్కామాస్ అవతారంలో తనదైన స్టైల్‌లో మేర్లపాక గాంధీ ఎంటర్‌టైనింగ్‌గా చెప్పనున్నట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం నాని శివనిర్వాణ అనే నూతన దర్శకునితో దానయ్య నిర్మాతగా 'నిన్నుకోరి' ప్రమోషన్, ట్రైలర్స్ అద్బుతమైన స్పందనను రాబట్టుకుంటున్నాయి.దీనిని జులై 6న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజుతో వేణుశ్రీరాం దర్శకత్వంలో 'ఎంసీఏ' ( మిడిల్ క్లాస్ అబ్బాయి) మొదలైంది. దీనితో పాటు నాని నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు చిత్రాలు కూడా హిట్టయితే నాని నాలుగో హ్యాట్రిక్‌కి సిద్దమైనట్లేనని భావించవచ్చు.