Advertisement
Google Ads BL

ఈ కుర్రాడు సవాల్ విసురుతున్నాడు..!


నారా రోహిత్ బొద్దుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సినిమా నుండి విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ పెద్దగా డాన్సులకు, ఫైట్ లకు స్థానంలేని కథలతోనే హీరోగా టాలీవుడ్ లో పాతుకుపోయాడు. ఎప్పుడూ క్లాస్ ఇమేజ్, మాస్ ఇమేజ్ వెంటపడకుండా సాఫ్ట్ కథలతోనే పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు నారా రోహిత్ లుక్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాగా వెయిట్ పెరిగిపోయి మరీ లావుగా కనిపించడంపై రోహిత్ ని అందరూ ఎప్పటి నుండో బరువు తగ్గించమని సలహాలు పడేస్తూ వస్తున్నారు. కానీ రోహిత్ వాటిని ఎప్పుడూ పెద్దగా లెక్కచేయ్యలేదు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు తాజాగా నారా రోహిత్ 'కథలో రాజకుమారి, శమంతకమణి' చిత్రాలు చేస్తున్నాడు. ఇక 'కథలో రాజకుమారి' ఫస్ట్ లుక్ లో కూడా కాస్త లావుగానే కనిపించిన నారా రోహిత్ ఈ మధ్యన జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కాస్త సన్నబడినట్లు కనిపించాడు. ఇంకేమిటి రోహిత్ సన్నబడ్డాడనే కామెంట్స్ బాగానే పడ్డాయి. మరి నారా రోహిత్ ఎలా సన్నబడ్డాడో అని కారణాలు వెతికేలోపే నారా రోహిత్ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ లుక్ లో రోహిత్ ఎంతెలా సన్నబడ్డాడో అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆ లుక్ నారా రోహిత్ జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నప్పటి ఫొటో అది. మరి సన్నబడానికి రోహిత్ చాలానే కష్టపడ్డాడని అనిపిస్తుంది కదూ.. మరి ఎప్పుడూ లావుగా వున్నా రోహిత్ ని చూసిన వారికి ఇలా ఇప్పుడు సన్నబడిన రోహిత్ ని చూస్తుంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

అయితే ఇంకా సన్నబడి చూపిస్తా అంటూ సవాల్ విసురుతున్నాడు ఈ కుర్రాడు. ఇప్పుడు వస్తున్న 'కథలో రాజకుమారి, శమంతకమణి' చిత్రాలలో రోహిత్ కాస్తంత  సన్నగా కనిపిస్తాడేమో గాని తన నెక్స్ట్ మూవీస్ లో మాత్రం బాగా స్లిమ్ అయిన రోహిత్ నే చూస్తారన్నమాట. ఇక రోహిత్ సన్నబడిన లుక్ పిక్ ని మీరు ఓ లుక్కేయండి!

Nara Rohith Weight Loss Look:

Nara Rohit, who appeared in the first look of the 'Kathalo Rajakumari' first look, That look was when Nara Rohit was doing the work at Jim. Rohit feels very hard.and Rohit look in very smart kathalo rajakumari and shamanthakamani movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs