Advertisement
Google Ads BL

'జై లవ కుశ' టీజర్ లీక్, వెంటనే అరెస్ట్!


'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' చిత్రాన్ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'జై లవ కుశ' చిత్రం సెప్టెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలని ఎన్టీఆర్ బ్యాచ్ ఇలా ప్లాన్ చేసింది. అందుకే దసరా బరిలో 'జై లవ కుశ' ని దింపుతోంది.

Advertisement
CJ Advs

మరి ఫుల్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటున్న 'జై లవ కుశ' కి సంబంధించిన టీజర్ లోని  కొన్ని సీన్స్ ని కొంతమంది ఇంటర్నెట్ లో లీక్ చేశారు. ఇక ఆ సీన్స్ ని లీక్ చేసిన కొద్దినిమిషాల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా సర్కిలేట్ అయ్యాయి. మరి ఈ విజువల్స్ ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో ఒక పాత్రకు సంబంధించినవి ఉన్నాయని అంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్, ఎన్టీఆర్ అభిమానులు కంగారు పడి... వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారట. ఇక చిత్ర యూనిట్ పోలీస్ ల దగ్గరికి వెళ్లడమే కాక సోషల్ మీడియాలో లీకైన విజువల్స్ ను ఒకరికొకరు షేర్ చెయ్యొద్దని వేడుకున్నారట. 

అయితే ఫిర్యాదును అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 'జై లవ కుశ' సీన్స్ ని లీక్ చేసిన వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేశారట. ఈ విషయాన్ని 'జై లవ కుశ' చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించాడు. అలాగే లీక్ చేసిన వ్యక్తుల వివరాలు కూడా త్వరలోనే బయటపెడతామని చెప్పాడు. ఇక విషయం విన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.

Jr NTR's Jai Lava Kusa teaser Leaked, Culprits Arrested:

Nandamuri Kalyan Ram, who is bankrolling Jr NTR's Jai Lava Kusa under his banner NTR Arts, has revealed that the culprits who leaked its teaser have been arrested.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs