మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కతున్న చిత్రం అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసుకుని సెట్స్ మీద కెళ్ళింది. మహేష్ 'స్పైడర్' షూటింగ్ ముగింపు దశలో వుంది. ఇక 'స్పైడర్' చిత్రం షూటింగ్ కంప్లీట్ కాగానే మహేష్ ...కొరటాల మూవీకి షిఫ్ట్ అవుతాడు. ప్రస్తుతానికి మహేష్, కొరటాల మూవీ షూట్ లో పాల్గొనకపోయినా కూడా కొరటాల మిగతా నటీనటులతో షూటింగ్ జరిపేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భరత్ అను నేను' టైటిల్ వాడుకలో వుంది. అయితే దాదాపు ఇదే టైటిల్ మహేష్ - కొరటాల చిత్రానికి ఫైనల్ అయ్యేలా ఉందంటున్నారు.
ఇకపోతే ఈ 'భరత్ అను నేను' చిత్రం కోసం హైదరాబాద్ నగర శివార్లలో భారీ బడ్జెట్ తో అసెంబ్లీ సెట్ ని ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్టర్ రెడీ చేశారు. అలాగే మహేష్ కి జోడిగా బాలీవుడ్ భామను ఈ చిత్రం కోసం దించుతున్నారు. 'ఎంఎస్ ధోనీ' చిత్రంతో గుర్తింపు పొందిన కైరా అద్వానీ ని ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా ఎంపిక చేశారు. మరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీతోనే కైరా అద్వానీ ఇలా మహేష్ కొత్త చిత్రంలో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ భామ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యిందట. 'భరత్ అను నేను' చిత్రం షూటింగ్ కోసం కైరా అద్వానీ బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చేసిందట.
మహేష్ బాబు లేకుండానే షూటింగ్ జరిపేస్తున్న కొరటాల శివ ఇప్పుడు హీరోయిన్ రిలేటెడ్ సీన్స్ ని తెరకెక్కించడంతో ఈ భామ ఇక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక కొరటాల - మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవడంతో ఈ 'భరత్ అను నేను' చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.