Advertisement
Google Ads BL

కృష్ణవంశీ ని వెధవ అంటున్నాడు..!


టాలీవుడ్ లో కృష్ణవంశీ కి క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి పేరుంది. సింధూరం, ఖడ్గం వంటి డిఫ్రెంట్ డిఫ్రెంట్  సినిమాలను టాలీవుడ్ కి అందించిన ఈ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో బాగా డల్ అయ్యాడు. రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలా తర్వాత సందీప్ కిషన్, రెజీనా జంటగా నక్షత్రం సినిమాని తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. అయితే ఈ చిత్రం ఇప్పుడు విడుడల కష్టాలను ఎదుర్కొంటుంది. దానితో కృష్ణ వంశీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే తయారైంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా  కృష్ణ వంశీ మీద  కొరియోగ్రాఫర్ రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనని ఒక సినిమాకి కొన్ని రోజులు పని చేయించుకుని తనకి డబ్బులు ఇవ్వకపోగా తనని చాలా అవమానించాడని లేటేస్ట్ గా జరిగిన  ఒక ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చాడు. అసలు కృష్ణ వంశీ ని రాకేష్ మాస్టర్ బండబూతులు తిట్టాడు. కృష్ణ వంశీ ఒక వెధవ అని అతనికి ఇద్దరు వెధవలు సపోర్ట్ అని ఎద్దేవా చేశాడు. జోగి బ్రదర్స్ మీద చేతులు వేసుకుని ఫోజ్ కొడుతూ అందరి మీద పెత్తనం చెయ్యడమే కృష్ణవంశీకి తెలుసనీ చెడామడా తిడుతున్నాడు. ఆయనేమన్నా దేవుడా అయన సినిమా హిట్టయ్యింది అంటే అది ఒక్క కృష్ణ వంశీ గొప్పదనం కాదు 24  క్రాఫ్టులు కలిస్తేనే సినిమా హిట్టవుతుందని చెబుతున్నాడు.

తనని ఒక సినిమాకి 11  రోజులు కొరియోగ్రఫీ చేయించుకుని కనీసం బెటాలు గాని డబ్బుగాని ఇవ్వలేదని... తన పేరు కూడా సినిమా టైటిల్స్ లో  వెయ్యలేదని చెబుతున్నాడు. ఇక ఇవన్నీ చెప్పడానికి కారణం కృష్ణ వంశీ తనని అవమానించడమేగాని అతనిపై ఎలాంటి శత్రుత్వం లేదని అంటున్నాడు. మరి ఆ డాన్స్ మాస్టర్ కి ఎంతగా కడుపు మండకపోతే ఇలా కృష్ణవంశీని పిచ్చ తిట్లు తిడతాడు. ఏది ఏమైనా ఈ విషయంతో కృష్ణ వంశీ పరువుకు డ్యామేజీ  ఏర్పడినట్లే అంటున్నారు. 

Rakesh Master Tells Nuvvu Oka Vedhavivi to Krishna Vamsi:

In a recent interview, choreographer Rakesh Master made some controversial statements on creative director Krishna Vamsi.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs