Advertisement
Google Ads BL

రవితేజ తమ్ముడు గురించి సంచలన విషయాలు!


రవితేజ సోదరుడు భరత్‌రాజు యాక్సిడెంట్‌ తర్వాత పలువురికి ఆయన గురించిన వ్యక్తిగత విషయాలేమీ ఎవ్వరికీ పెద్దగా తెలియకుండా పోయాయి.ఆయన డ్రగ్స్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో పాటు తిరుమలలో సిగరెట్టు కాల్చడం, మీడియాను బూతులు తిట్టడం మాత్రమే తెలుసు. కాగా చాలా కాలం కిందట టాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళీ చాలా కాలం కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భరత్‌ గురించి చెప్పిన పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఆయన మాట్లాదడుతూ, నేను మద్రాస్‌లో పరుచూరి బ్రదర్స్‌ దగ్గర రచయితగా పనిచేసేటప్పుడు పరుచూరి వారి కాంపౌండ్‌లోనే ఉన్న చిన్నగదిలో ఉండేవాడిని. అప్పుడు రవితేజ చిన్న చిన్న వేషాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అప్పటికీ నాకు రవితేజ కూడా పరిచయం లేడు. ఒక రోజు భరత్‌ హైదరాబాద్‌ నుంచి ఓ సంపన్నమైన అమ్మాయిని లేపుకొచ్చి ఆశ్రయం ఇవ్వమని పోసానిని అడిగాడట.దాంతో పోసాని తాను ఉన్న గది వారికిచ్చి తాను బయట వరండాలోనే గడిపాను. కానీ పక్కరోజున పరుచూరి బ్రదర్స్‌ నా రూమ్‌ చూసి నేనేదో తప్పుచేశానని అనుకొని నన్ను ఆ రూమ్‌ నుంచి ఖాళీ చేయించారు. కనీసం నేను చెప్పే వివరణ సైతం వినకుండా నాకు నీడలేకుండా చేసిన పరుచూరి వారి గడప మరలా నేను తొక్కలేదు.

భరత్‌కు, ఆయన లేపుకొని వచ్చిన అమ్మాయికి నేనే పెళ్లి జరిపించాను.. అని తెలిపాడు. ఇక తాజాగా ఐదారేళ్ల కిందట భరత్‌ మరో డబ్బున్న ఎన్నారై అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడని, ప్రస్తుతం వారు విడిపోవడంతో ఆమె అమెరికాలో ఉంటోందని, అందుకే భరత్‌ చనిపోయినా ఆమె నుంచి ఆమె కుటుంబీకుల నుంచి స్పందన లేదని తెలుస్తోంది. కాగా యాక్సిడెంట్‌ జరిగిన రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఆయన తన ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీ సందర్భంగా నోవాటెల్‌ హోటల్‌లో తాగుతూ ఉన్నట్లు పోలీసులు సిసి కెమెరాను పరిశీలించి నిర్దారణకు వచ్చారని సమాచారం. 

 

 

 

Posani Speaks on Raviteja Brother Bharath Marriages:

Well noted writer and versatile actor Posani Krishna Murali has revealed some interesting facts that happened in his life related to Raviteja’s brother Bharat marriage.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs