Advertisement
Google Ads BL

బాలయ్య, మహేష్, ఎన్టీఆర్..ఎవరు తగ్గుతారో?


ఈసారి బడా సినిమాలు దసరా బరిలోకి దిగబోతున్నాయి. అవన్నీ అలాంటి ఇలాంటి సినిమాలు కాదు. టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ.. పూరి డైరెక్షన్ లో 'పైసా వసూల్' తో దసరా సెలవులు క్యాష్ చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటూ అన్ని విషయాల్లో వెనకబడిపోయిన మహేష్ కూడా మురుగదాస్ డైరెక్షన్ లో 'స్పైడర్' తో దసరా సెలవలకి బాక్సాఫీసు ను కొల్లగొట్టడానికి తయారైపోయాడు. ఇక నిన్నటికి నిన్న ఎన్టీఆర్.. బాబీ డైరెక్షన్ లో చేస్తున్న 'జై లవ కుశ'ని కూడా దసరా బరిలో నిలపనున్నట్లు ఎనౌన్స్ చేశారు.

Advertisement
CJ Advs

మరి బడా హీరోలు ముగ్గురు ఇలా ఒకేసారి ప్రేక్షకులముందుకు సందడి చేయ్యడానికి వచ్చేస్తుంటే ప్రేక్షకులు హ్యాపీగానే ఫీల్ అవుతారు గాని నిర్మాతలకు పెద్ద దెబ్బ పడుద్ది. ఎందుకంటే కావాల్సిన థియేటర్స్ దొరక్కపోవడం ఒక సమస్య అయితే.... కలెక్షన్స్ విషయంలోనూ తేడా కొట్టే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. మరి ఈ దసరా బరి ఇలా ఇంత హాట్ గా మారుతుందని ఎవరూ ఎక్సపెక్ట్ చేసుండరు. మరి ఇలా 10  రోజుల్లో మూడు బడా సినిమాలు అంటే కష్టమే అంటున్నారు. ఇలా ఎవరికి వారే ప్రెస్టీజ్ కి పోయి సినిమాని విడుదల చేస్తే మాత్రం చాలానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ దసరా బరినుండి ఎవరైనా ఒక్కరు తప్పుకున్నా జరిగే నష్టాన్ని పూడ్చగలమని అంచనా వేస్తున్నారు కొందరు. కానీ ఎవ్వరూ తగ్గేలా కనబడంలేదు.

అందరికన్నా ముందే బాలకృష్ణ - పూరి సినిమాకి దసరా బరిలో ఉంటున్నామని ఎనౌన్స్ చేశారు. అందుకే వారి 'పైసా వసూల్' సినిమా కూడా అంతే ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. మరి వారు ఎలాగూ ఈ బరి నుండి తప్పుకోరు. మరోపక్క మహేష్ కూడా 'స్పైడర్' రిలీజ్ డేట్ విషయంలో కాస్త గట్టిగానే  వున్నాడు. ఇప్పటిదాకా షూటింగ్ లేట్ అవుతూ ఫస్ట్ లుక్ విషయంలో, టీజర్ రిలీజ్ విషయంలో మాటతప్పిన మురుగదాస్ మాత్రం ఈసారి మాట తప్పనని అంటున్నాడు. ఎలాగైనా 'స్పైడర్' చిత్రాన్ని దసరాకే విడుదల చెయ్యాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఇకపోతే ఎన్టీఆర్ ముందుగా 'జై లవ కుశ' ని సెప్టెంబర్ 1 న విడుదల చేస్తాడని ప్రచారం జరిగినప్పటికీ కాదు కాదు సెప్టెంబర్ 21 న అంటూ కొత్త డేట్ ప్రకటించారు. మరి తన బాబాయ్ దసరాకి వస్తున్నాడని తెలిసినా కూడా ఎన్టీఆర్ తన సినిమాని దసరాకే తీసుకురావడం వెనుక ఏముందో గాని ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గుతాడనే ప్రచారం మాత్రం మొదలైంది.

ఎందుకంటే 'జై లవ కుశ' ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణతో వైరం కొని తెచ్చుకోడు. అందుకే సైలెంట్ గా 'జై లవ కుశ' కి మరో డేట్ వెతుకుతారని ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు అన్ని విషయాల్లో అంటే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లో యమా ఫాస్ట్ గా వున్న ఎన్టీఆర్ ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఎవరు తగ్గుతారనేది?

Vijaya Dasami Release Movies List:

Balakrishna Paisa Vasool, Mahesh Babu Spyder, Jr Ntr Jai Lava kusa in Vijaya Dasami Race
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs