Advertisement
Google Ads BL

సుమే కాదు అనసూయ కూడా హ్యాండిచ్చింది!


బాలీవుడ్ లో సక్సెస్ అయిన బిగ్ బాస్ షో ని స్టార్ మా ఛానల్.. టాప్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగులో ప్రసారం చెయ్యడానికి సన్నద్ధం అవుతుంది. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఎన్టీఆర్ ని తీసుకున్న స్టార్ మా ఈ షో కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక బిగ్ బాస్ షో కూడ ముంబై మహానగరంలో బాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతుంది. మరి ఇంకా ఛానల్ లో ప్రసారం కాకముందే ఈ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ తో క్రేజ్ పెంచేసిన మా ఛానల్ ఇపుడు ప్రోమోతో అదరగొడుతుంది. ఎన్టీఆర్ ఈ ప్రమోలో బిగ్ బాస్  షో మీద విపరీతమైన అంచనాలు పెంచేసాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ పార్టిసిపేట్స్ ఎంపిక లో బిజిగా వుంది. ఇప్పటివరకు కొంతమందిని ఈ బిగ్ బాస్ షో కోసం బిగ్ బాస్ టీమ్ వారు ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి . అలాగే ఈ షోని కొంతమంది రిజెక్ట్ చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈ రిజెక్ట్ చేసిన వారిలో యాంకర్ సుమ ఉందని... ఆమెకు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఆమె ఒప్పుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే దారిలో యాంకర్ అనసూయ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ టీమ్ అనసూయని షో కోసం అప్రోచ్ కాగా అందుకు అనసూయ నో చెప్పినట్లు చెబుతున్నారు.

అయితే అనసూయ.. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ని ఎందుకు రిజెక్ట్ చేసిందో కూడా కారణాలు చెబుతున్నారు. అనసూయ ఇపుడు రామ్ చరణ్ రంగస్థలంలో ఒక ముఖ్యమైన రోల్ చేస్తుందట. ఇప్పుడే సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన అనసూయకి బిగ్ బాస్ షో లో పాల్గొనేందుకు డేట్స్ కుదరకపోవడంతో ఈ షో కి చేయలేనని చెప్పిందని చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు అనసూయ చాలా ఫీల్ అయ్యిందట. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసే బిగ్ బాస్ షోలో తాను భాగం కాలేకపోతున్నందుకు చాలా బాధపడిందనే టాక్ కూడా వినబడుతుంది. సో ఈ లెక్కన ఎన్టీఆర్ ని ఇద్దరు టాప్ యాంకర్స్ రిజెక్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారన్నమాట.

Anasuya also Rejected Big Boss Show:

After Suma, now another Anchor Anasuya also rejected Ntr's Big Boss show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs