Advertisement
Google Ads BL

సాయి, వరుణ్... ఇద్దరికీ కీలకమే!


మెగాహీరోలలో కొత్తతరం హీరోలైన సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌లది భిన్నమైన శైలి. సాయి తన మేనమామలైన చిరు, పవన్‌లను దాదాపు కాపీ కొట్టేస్తాడు. ఇక చిరు పాటను రీమిక్స్‌ చేస్తాడు. నటనలో పెద్దగా రాణించకపోయినా కూడా దానిని తన స్టెప్స్‌, ఫైట్స్‌తో కవర్‌ చేస్తాడు. దాంతో అతితక్కువ సమయంలోనే ఆయన మాస్‌ని ఆకట్టుకున్నాడు. ఇక మాస్‌ మంత్రమే పఠించే ఈయన నటించిన 'తిక్క, విన్నర్‌' లు డిజాస్టర్స్‌గా నిలిచాయి. తనకు గాడ్‌ఫాదర్‌, తనకు హిట్లు ఇచ్చి, ఏకంగా తన మార్కెట్‌ని 25కోట్లకు చేర్చి, కాస్త యావరేజ్‌ సినిమా పడినా చాలు మినిమం యాక్షన్‌ హీరోను చేసిన దిల్‌ రాజు బేనర్‌లో కాకుండా వరుసగా మూడోసారి బయటి చిత్రంలో 'జవాన్‌' చేస్తున్నాడు. ఇది కూడ ఆయన రూట్‌లోనే పక్కా కమర్షియల్‌ చిత్రం. 

Advertisement
CJ Advs

ఇక అదే సమయంలో నటనాపరంగా మంచి పేరు, మంచి అందగాడైన వరుణ్‌తేజ్‌ 'ముకుంద, కంచె'ల తర్వాత మాస్‌ కోసం ట్రై చేసి వరుసగా 'లోఫర్‌, మిస్టర్‌' చిత్రాలతో బోల్తాకొట్టాడు. అందునా పూరీ, శ్రీనువైట్ల వంటి వారు ఆయనకు షాకిచ్చారు. నటన పరంగా సాయి కంటే బాగా చేసే వరుణ్‌తేజ్‌ తాజాగా 'ఫిదా' చేస్తున్నాడు. 'జవాన్‌' దర్శకుడు బి.వి.ఎస్‌. రవిలానే శేఖర్‌కమ్ముల కూడా ఫేడవుట్‌ అయిన దర్శకుడు. ఇక సాయికి హిట్స్‌ ఇచ్చి మంచి కమర్షియల్‌ హిట్స్‌ ఉండి, మంచి ఉత్తమాభిరుచి ఉన్న దిల్‌రాజు సినిమా కావడంతో దీనితో వరుణ్‌తేజ్‌కి పెద్ద హిట్‌ రావడమేకాదు.. తన పంథాలోనే ముందుకు వెళ్లే చాన్స్‌ ఉంది. ఇక 'ఫిదా' జులై 21న విడుదల కానుండగా, అతితక్కువ గ్యాప్‌లోనే 'జవాన్‌' ఆగష్టు11న రానుంది. మరి వీరిద్దరూ తమకు అచ్చొచ్చిన పంధాలోనే పెద్దహిట్స్‌ కొట్టాలని ఆశిద్దాం....! 

Sai Dharam Tej and Varun Tej's Next Movies:

Sai Dharam Tej's Jawaan and Varun Tej's Fidaa movies are important to Their Movie Life 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs