Advertisement
Google Ads BL

డిజె రిజల్ట్‌.. వారే చెప్పేశారు..!


అల్లు అర్జున్‌, దిల్‌ రాజు వీరిద్దరి కలయికలో వచ్చిన డిజె దువ్వాడ జగన్నాథమ్‌ ఏ మేరకు విజయం సాధించింది?. అసలు విజయం దక్కిందా లేక పరాజయాల్లో ఒకటిగా నిలుస్తుందా? ఈ అనుమానం చాలామందిలో ఉంది. ఇవిగో కలెక్షన్లు అంటూ చిత్ర సంబంధికులు చెబుతున్నప్పటికీ, థియేటర్లు, మాల్స్‌ వద్ద మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. డిజె తొలిరోజు నైట్‌ షోకు ఫలితం ఎలా ఉంది అనేది స్పష్టమైంది. సన్నిహితుల ద్వారా హీరో చెవిలో కూడా పడింది. దాంతో అల్లు అర్జున్‌ మూడ్‌ మారిందట. ముభావంగా ఉండిపోయారు. దాంతో దిల్‌ రాజు మేల్కొని ప్రచార ఆర్భాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దిన పత్రికల్లో రిలీజ్‌ వరకు చిన్న చిన్న యాడ్స్‌ ఇచ్చారు.

Advertisement
CJ Advs

రిలీజ్‌ తెల్లారి నుండి యాడ్‌ సైజ్‌ ఆఫ్‌ పేజీకి పెంచారు. నిజానికి పేపర్‌ ప్రకటనలకు దిల్‌ రాజు ఎక్కువ ఖర్చు చేయడు. కానీ డిజె కోసం మూడు దిన పత్రికలకు వరుసగా ఆఫ్‌ పేజీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అలాగే నాలుగవ రోజే థాంక్స్‌ మీట్‌ అంటూ హడావుడిగా ఏర్పాటుచేశారు. సినిమా హిట్‌ అయితే కనీసం వారమైన ఆగాలి. కానీ అప్పుడే పెట్టేశారు. థాంక్స్‌ మీట్‌లో అభిమానుల హడావుడి ఉండాలని, గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ ప్లాన్‌ చేసింది. పాస్‌ లన్నింటిని స్వాధీనం చేసుకుని, అభిమానులను ప్రత్యేకంగా పిలిచి ఇచ్చారు. వేడుక జరిగే హాల్లో నలుమూలల కూర్చుని హడావుడి చేయాలనే సూచనలు వారికి వెళ్ళాయని సమాచారం. 

ఇవన్నీ చూస్తుంటే డిజె హిట్‌ అయిందా లేదా అనేది తెలుస్తూనే ఉంది. ఈ విషయాన్ని తన చర్యల ద్వారా నిర్మాత చెప్పేశారు.

Doubts on DJ Duvvada Jagannadham Result:

Duvvada Jagannadham Movie Thank You Meet After 4 Days of Movie Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs