Advertisement
Google Ads BL

ట్రైలర్ చూస్తే 'విఐపి2' కొత్తగా ఏం లేదు..!


తమిళంలో ధనుష్, అమల పాల్ జంటగా నటించిన 'విఐపీ' చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే విఐపిని తెలుగులో 'రఘువరన్ బిటెక్' గా దించి ఇక్కడా కూడా బంపర్ హిట్ కొట్టాడు ధనుష్. 'విఐపీ'లో రఘువరన్ ఒక నిరుద్యోగి ఇంజినీర్గా పరిచయమై.... ఒక బడా కంపెనీకి పోటీ ఇచ్చే ఇంజినీర్ గా ఎలా ఎదిగాడు అనేదానిని, అమ్మమీద ప్రేమను, అమ్మాయి మీద తనకున్న ప్రేమను ఆవిష్కరించి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే విఐపిని తమిళంలో 'విఐపి 2' గా తెరకెక్కిస్తున్నాడు. రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

Advertisement
CJ Advs

అయితే 'విఐపి 2' ట్రైలర్ చూస్తున్నంతసేపు మనకు 'విఐపి' చిత్రమే గుర్తుకువస్తుంది. డైరెక్టర్ సౌందర్య మొదటి భాగంలాగే రెండో భాగాన్ని తెరకెక్కించిందని అర్ధమవుతుంది. రఘువరన్ ఇంజినీర్ గా ఉద్యోగం పోగొట్టుకుని మళ్ళీ కనస్ట్రక్షన్ కంపెనీల చుట్టూ ఉద్యోగం గురించి తిరుగుతూ బడా కనస్ట్రక్షన్  కంపెనీ ఎండీ కాజోల్ తో గొడవ పెట్టుకోవడం వంటివి చూస్తుంటే మనకు విఐపినే గుర్తుకు వస్తుంది. అలాగే ఈసారి బడా కనస్ట్రక్షన్  కంపెనీ ఎండీ గా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ నటించింది. కాజోల్, వసుందరగా నెగెటివ్ రోల్ లో అదరగొట్టింది. అలాగే ఈ 'విఐపి 2' లో అమల పాల్ ని పెళ్లి చేసుకుని రఘువరన్ పడే కష్టాలను చాలా కామెడీగా పరిచయం చేశారు. ఇక కాజోల్ ని ధనుష్ అమూల్ బేబీ గా వర్ణించడం భలే కామెడీగా అనిపిస్తుంది.

అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి ధనుష్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇక విఐపి 2 ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నాడు ధనుష్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click Here to see The VIP 2 Trailer

Dhanush VIP 2 Trailer Released:

Dhanush VIP 2 Trailer Talk- Same VIP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs