నాగ్ తనకు షూటింగ్ చేసేటప్పుడే ఆ చిత్రం ఆడుతుందా? లేదా? అనేది తెలిసిపోతుందని పలుసార్లు చెప్పాడు. అవి నిజమయ్యాయి కూడా. ఇక తన కొడుకుల సంగతైనా ఆలోచిస్తాడేమో గానీ తాను నటించిన చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉంటే ఎంత పోటీ సినిమాలున్నా లెక్కచేయడు. దానికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. కిందటి ఏడాది సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', బాలకృష్ణ 'డిక్టేటర్', శర్వానంద్, దిల్ రాజు ల 'ఎక్స్‌ప్రెస్ రాజా' లతో పోటీ పడి 'సోగ్గాడే చిన్నినాయనా'తో తన కెరీర్‌లోనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అది కూడా కళ్యాణ్‌కృష్ణ అనే కొత్త దర్శకుడితో విన్నర్‌గా నిలిచాడు.
కాగా ప్రస్తుతం ఆయన, ఆయన కాబోయే కోడలు సమంత, అందాల ఆరబోతలో ముందుండే సీరత్‌కపూర్‌లతో ఆయన 'రాజుగారి గది2'లో నటిస్తున్నాడు. 'రాజుగారి గది' హిట్ కావడంతో యాంకర్‌గా పనిచేస్తూ తన తమ్ముడి కోసం ఇండస్ట్రీలో డైరెక్టర్ అయిన ఓంకార్‌తో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తోంది. 'రాజుగారి గది'కి ఈ కథకు ఏమాత్రం పోలికలు ఉండవని, ఓ మలయాళ సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందంటున్నారు.
ఇక ఆగష్టు11న లాంగ్ వీకెండ్ కానుంది. ఆగష్టు15 రావడంతో అదిసాధ్యమైంది. ఈ డేట్‌కు రావాలని పలువురు స్టార్లు భావించినా వీలుకాలేదు. కేవలం నితిన్ 'లై', బోయపాటి శ్రీను 'జయ జానకి నాయక', సాయిధరమ్‌తేజ్ 'జవాన్'లు మాత్రమే వస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు అఫీషియల్ గా 'లై'చిత్రం నిర్మాత మాత్రం ఖరారు చేశారు. మిగిలినవి వచ్చినా కూడా అవ్వన్నీ యంగ్‌హీరోల చిత్రాలు మాత్రమే. కాబట్టి వారిని చూసి నాగ్ వెనుకకు వెళ్లే పని ఎప్పుడు చేయడు. మరి ఆయన తన 'రాజుగారి గది2'ను ఆగష్టు11 వీకెండ్‌ని నమ్ముకోకుండా ఆగష్టు25కి వెళ్లడం చూస్తే నాగ్.. ఈ సినిమా పై ఏమన్నా డౌట్ గా ఉన్నాడా అనిపిస్తుంది.