సుచి లీక్స్ అంటూ ఆ మధ్యన కోలీవుడ్ లో టాలీవుడ్ లో తెగ హడావిడి చేసి సైలెంట్ అయినా సింగర్ సుచిత్ర ఇప్పుడు సూచి లీక్స్ పార్ట్ 2 అంటూ మొదలు పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. సింగర్ సుచిత్ర ట్విట్టర్ ఎకౌంట్ నుండి కోలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ ల పర్సనల్ వీడియోస్ ని బయట పెట్టడమే కాకుండా టాలీవుడ్ ని కూడా కదిలించింది. కోలీవుడ్ అగ్రతారలైన ధనుష్, త్రిష మరెందరో నటీనటుల పర్సనల్ వీడియోస్ ని పనిగట్టుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసి పెద్ద సంచలనాలకు తెరలేపింది. ఎప్పుడు ఎవరి వీడియో బయటికి వస్తుందో తెలియక హడలి చచ్చారు ఒక్కొక్కరు.
అయితే ఈ లీక్స్ మొదలయ్యాక సింగర్ సుచిత్ర మానసిక స్థితి బాగోక ఆస్ట్రేలియా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుందని ప్రచారం జరిగింది. మళ్ళీ మధ్యలో సూచి లీక్స్ పార్ట్ 2 రాబోతున్నట్లు కూడా ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడా పార్ట్ 2 వీడియోస్ లీకులు మొదలయ్యాయని అంటున్నారు. అయితే ఇప్పుడు సూచి లీక్స్ పార్ట్ 2 కి బలయ్యింది మాత్రం తమిళ్ లో పలు సినిమాల్లో నటించిన నివేత పేతురాజ్ అంటున్నారు. నివేత పేతురాజ్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈమె ఎవరో చెప్పుకోండి అంటూ పజిల్ విసిరింది.
ఈ నివేత పేతురాజ్ ఈ మధ్యనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. శ్రీవిష్ణు పక్కన 'మెంటల్ మదిలో' నటిస్తున్న ఈ నివేత పేతురాజ్ పర్సనల్ వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పార్ట్ 2 స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ కోలీవుడ్ స్టార్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఎవరి పర్సనల్ వీడియోస్ బయటికి వస్తాయో అని హడలి చస్తున్నారు. మరి ప్రస్తుతం నివేత పేతురాజ్ ఫొటోస్ లీక్ చేసిన సూచి లీక్స్... త్వరలోనే ఇంకొన్ని ఫొటోస్, వీడియోస్ తో మీముందుకు వస్తుంది అని ప్రకటించి మళ్ళీ సంచలనాలకు తెర తీసింది.