Advertisement
Google Ads BL

ఈసారైనా అదరగొడతాడా..?


తమిళంలోని రజినీ, కమల్‌, సూర్య నుంచి కార్తికి, విజయ్‌ ఆంటోనికి కూడా గుర్తింపు ఉంది. కానీ కోలీవుడ్‌ స్టార్స్‌ అయిన తల దళపతి అజిత్‌కు, ఇళయ దళపతి విజయ్‌కు మాత్రం తెలుగులో మార్కెట్‌ లేదు. విజయ్‌ విషయానికి వస్తే ఇటీవలే ఆయన 'తుపాకి, జిల్లా' చిత్రాల ద్వారా ఫర్వాలేదనిపించుకున్నాడు.కానీ ఆ తర్వాత వచ్చిన 'పోలీస్‌'నైతే దిల్‌రాజు కూడా నిలబెట్టలేకపోయాడు. 

Advertisement
CJ Advs

దాంతో తాజాగా ఆయన నటించే చిత్రాన్ని మొదట తమిళంలో విడుదల చేస్తారని, అక్కడ హిట్టయితే ఎవరో ఒక స్టార్‌ని ఒప్పించి 'కత్తి'లా రీమేక్‌ చేద్దామని కొందరు భావించారు. కానీ విజయ్‌ మాత్రం అసలు తగ్గడం లేదు. 'రాజు రాణి' ఫేమ్‌ అట్లీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండ్రల్‌ మూవీస్‌ నిర్మిస్తున్న ఆయన 61వ చిత్రానికి 'అదిరింది' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. విజయ్‌ ఈ చిత్రాన్ని ఇంతగా పట్టుబట్టి కేవలం డబ్‌ చేయడం తనమీద తెలుగు ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతో కాదు. 

తెలుగులో ఎదురేలేని రచయితగా పేరొంది, భజరంగీ భాయిజాన్‌, బాహుబలిల ద్వారా దేశంలోనే స్టార్‌ రైటర్‌గా మారిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌పై ఉన్న నమ్మకంతోనే. 'అదిరింది' చిత్రానికి కథనందించింది విజయేంద్రప్రసాద్‌ కావడం, ఇందులో అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న సమంత నటిస్తుండటంతో పాటు ఇందులో కాజల్‌, నిత్యా మీనన్‌లు నటిస్తుండటం, సంగీతాన్ని ఏ ఆర్‌ రెహ్మాన్‌ అందిస్తుండటం వంటి వాటి వల్లే. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చూస్తే అరవ అతికనిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 19న దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. 

Tamil Star Vijay New Movie Title Adirindi :

Adirindi’s Tamil original Mersal’s first look and title logo was unveiled to extra ordinary response.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs