వైసీపీ పార్టీ కోసం ఎందరు కష్టపడినా కూడా రెడ్లు, క్రిస్టియన్లకే ప్రాముఖ్యమనేది కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల నైజాన్ని గమనించిన వారికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కమ్మవారికే ప్రాధాన్యం అనేది నిజం. చిరు కూడా ప్రజా రాజ్యంలో తన కాపు వర్గానికే ప్రాధాన్యం ఇచ్చాడనేది ఎవరు కాదన్నా నిజం.. కాబట్టి కులజాడ్యం వదిలేట్లు లేదు.
పవన్ మీద మాత్రం ఇతర అన్నికులాల వారు, తటస్తులు ఆసక్తి చూపుతున్నారు. కాగా గత కొన్ని రోజులగా రోజా వైసీపీని వదిలి జనసేనలోకి వస్తుందనే పుకార్లు వస్తున్నా కూడా పవన్ నైజం తెలిసిన వారు మాత్రం ఆమె వాస్తన్నాన్న పవన్ ఒప్పుకోడని నమ్మకంతో ఉన్నారు. అలాంటి వారు పార్టీలోకి ప్రవేశిస్తే జనసేన కూడా ప్రజా రాజ్యం పార్ట్ 2 అవుతుందని అందరికీ తెలుసు. ఇక తాజాగా రోజక్క తలా తోకాలేని జనసేనలో నేనెందుకు చేరుతాను? ఆయనేమైనా మా కంటే పెద్ద అంటూ బూతులందుకుంది.
మరో వైపు తాను ప్రాణం పోయిన టిడిపిలోకి వెళ్లనని సెలవిచ్చింది. తన జీవితాంతం చివరి శ్వాస వరకు జగన్ 'పక్కనే' ఉంటానంటోంది, ఇంకా ఆమో మాట్లాడుతూ, తాను రెడ్డిని కాబట్టే టిడిపి తనను పట్టించుకోలేదని,ఎన్నికల్లో ఓడించిందని, అదే జగనన్న కాబట్టే తనకు చెందిన నాకు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించాడని చెప్పింది. దీనిబట్టి ఆమె సభ్యసమాజానికి జగనన్న అయితే రెడ్లకు వెంటనే సీటు ఇచ్చి, ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటాడన్నమాట...! ఇక నీళ్లు లేక అడక్కతింటుంటే మద్యం ఏరులై పారిస్తున్నారని, బార్ల సంఖ్యను పెంచారని, కాబట్టి నారా పేరును చంద్రబాబు సారా చంద్రబాబునాయుడుగా మార్చుకోవాలన్నారు.
మద్యంలో వచ్చే అక్రమ డబ్బులో బాబు కెంత లోకేష్‌కి ఎంత అని ప్రశ్నించింది. సింహం వంటి జగన్‌ను పందికొక్కు వంటి పప్పు సవాల్ చేయడం పెద్ద జోకేనన్నారు. ముందుగా జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో.. పో.. అంటూ నోటి కొచ్చినట్లు తిట్టింది తిట్టికుండా తన సహజ ధోరణిలో ఇంకా మార్పు రాలేదని చెప్పకనే చెప్పింది. మరోపక్క రాజకీయ వ్యూహకర్త మాత్రం జగన్‌కు రోజా వంటి వారి వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం వస్తుందని తేల్చిచెప్పాడు. మరి జగనన్న ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సివుంది...!