Advertisement
Google Ads BL

రజినీని ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారు..!


ఒకవైపు బిజెపి నాయకులు, హిందు సంస్థలు, తమిళ ప్రజలు తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడినందు వల్ల రజినీకి రాజకీయాలలోకి రావడానికి ఇదే సరైన సమయమని, తమ హీరోకు దేవుడు సీఎంను చేసే ఉద్దేశ్యంతోనే ఇలాంటి పరిస్థితులను కల్పించాడని తలైవా అభిమానులు రజినీపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా మోదీ సైతం ప్రైవెట్‌గా రజినీకి ఫోన్‌ చేశాయనే వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి.

Advertisement
CJ Advs

ఇక బిజెపిలో నెం2 అనబడే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రజినీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే శుభమని, ప్రజలకు మేలు జరుగుతుందని, ఆయన రాజకీయ ఎంట్రీ శుభపరిణామమని తెలిపాడు. పనిలో పనిగా రజినీ కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పాడు. మరి తమిళనాడుకు చెందిన ముఖ్య బిజెపినేత, వివాదాస్పద నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి మాత్రం రజినీ రాజకీయాలోకి రాకూడదని గట్టిగా చెబుతున్నాడు. 

తమిళులు చదువుకున్నవారని, చదువు, రాజ్యాంగం తెలియని రజినీ సీఎం అయితే ఏం చేయగలడని ప్రశ్నిస్తున్నాడు. పనిలో పనిగా ఎన్టీఆర్‌, జయలలిత, ఎమ్జీఆర్‌....ఇలా అందరినీ తిట్టిపోస్తున్నాడు.ఇక తాజాగా స్వామి రజినీకి ఇచ్చిన వార్నింగ్‌ సంచలనం సృష్టిస్తోంది. రజినీకి సంబంధించిన అనేక రహస్యాలు, వాటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని బాంబు పేల్చాడు. రజినీ వ్యక్తిగత జీవితానికి చెందిన ఆధారాలతో పాటు ఆయన ఆర్దిక లావాదేవాల అక్రమాల చిట్టా తనవద్దనే ఉందని హెచ్చరించాదు. 

రజినీ రాజకీయాలలోకి రాకూడదని ఆయన నటుడిగానే ఉండాలని, కానీ ఆయన రాజకీయాలలోకి వస్తానంటే మాత్రం తాను తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని, వాటిని చూస్తే రజినీ వీరాభిమానులు కూడా ఆయనను చీదరించుకుంటారని వార్నింగ్‌ ఇవ్వడం చూస్తుంటే సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ అనిపిస్తోంది. 

ఎందుకంటే స్వామి బహుమేధావి, ఎందరో మహామహులను జైలుకు పంపిన ఘనత ఆయనది. ఆయన ఆధారం లేకుండా ఏదీ మాట్లాడడు. అంటే ఒకవైపు మోదీ, అమిత్‌షాలు రాజకీయాలలోకి రమ్మంటూనే వస్తే బిజెపిలోకి రావాలని, లేకపోతే స్వామి చేత గబ్బుపట్టిస్తామని రజినీని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారా? అనే సందేహం కలుగకమానదు. 

Subramanian Swamy Created A New Warning For Rajinikanth:

Tamil Nadu Chief Minister and controversial leader Subramanian Swamy strongly suggests that Rajini should not come into politics.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs