మొన్న విడులైన 'డిజె' చిత్రం గురించి సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఓ వ్యక్తి అయితే 'అదుర్స్'లోని ఎన్టీఆర్ ద్విపాత్రాభినయాలను రెండింటిని కలిపి ఒకే కథ రాశారని ఎద్దేవా చేశాడు. మరి కొందరు ఈ చిత్రం 'అదుర్స్, అపరిచితుడు, ఆజాద్, సరైనోడు.. ' ఇలా ఎన్నో కథలను కలిపి కిచిడీలాగా తయారు చేసి ప్రేక్షకులకు వడ్డించారని, వాట్ ఎన్ ఐడియా.. దిల్‌రాజు అండ్ హరీష్ శంకర్‌జీ' అంటూ చిత్రాన్ని ఓ దులుపు దులిపారు మరి కొందరు.
దీనికి కోపగించిన బన్నీ అభిమానులు ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన కుట్రగా వర్ణిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కేవలం ఒక కులం వారిని టార్గెట్ చేసినట్లుగా కొందరు భావిస్తున్నారు. మరి కొందరు కేవలం పంచాక్షరీని చమకం, నమకం అంటూ వారిష్టం వచ్చినట్లు వాడుకుని పైగా నేనూ బ్రాహ్మణున్నే,.. నా కులాన్ని నేను ఎందుకు తిడుతాను..అసభ్యంగా చూపిస్తాను చెప్పండీ అని దీనంగా మొహం పెట్టుకున్నాడు హరీష్ శంకర్.
ఇక దిల్‌రాజు తనకు మాత్రమే వేంకటేశ్వరస్వామి భక్తి ఉన్నట్లుగా మాట్లాడాడు. ఇక్కడ సమస్య ఏ కులాన్ని కించపరిచారు? అన్నది కాదు.. ఏ కులానైనా సరే ఎందుకు టార్గెట్ చేయాలి? విజయవాడలోని వారందరు రౌడీలు, కమ్మవారే అన్నట్లు ఎందుకు తీశారు? అసలు సందర్బం లేకపోయినా కావాలని ఈ వివాదాలన్నింటినీ సృష్టించి కథలో దమ్ములేదు కాబట్టి ఇలాగైనా చేద్దామని చివర్లో ఇలాంటివి యాడ్‌చేశారా? అనే అనుమానం వస్తుంది.
ఒక్క ముస్లిం జిహాదీ అయినంత మాత్రాన ముస్లింలందరూ ఉగ్రవాదులే, క్రిస్టియన్లందరూ మత మార్పిడి చేస్తారని, హిందువులు, బ్రాహ్మణులు ఇలా వీరు ఏ మతం పుచ్చుకున్నా కేవలం డబ్బు కోసమే మతం మార్చారని ఎలా భావిస్తాం..? ఇక తాను బ్రాహ్మణున్నే అని చెప్పిన హరీష్ శంకర్ ఈ చిత్రంలో చెప్పులేసుకుని గాయత్రీ మంత్రం వంటి పఠించడంవంటివి తెలిసి చేశాడా? తెలియక చేశాడా? గతంలో ఓ హిందీ చిత్రంలో అమితాబ్ చెప్పులు వేసుకుని గాయతీ మంత్రం జపించడం పెద్ద వివాదాన్ని సృష్టించిన సంగతి హరీష్‌కి, దిల్‌రాజులకు తెలీదా?వంటి పలు అనుమానాలు ఈ చిత్రం చూస్తున్నవారికి వస్తున్నాయనేది వాస్తవం....?