Advertisement
Google Ads BL

జాహ్నవి ఎంట్రీ గురించి శ్రీదేవి చెప్తుందిలా!


శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినీ అరంగేట్రం ఎప్పుడు ఉంటుందో అని అందరూ అర్రులు చాచేలా ఎదురు చూస్తున్నారు. అదిగో  జాన్వీ సినీరంగప్రవేశం ఇదిగో జాన్వీ సినీరంగ ప్రవేశం అంటూ మీడియాలో రోజుకో వార్త ప్రచారమవుతుంది. కానీ శ్రీదేవి మాత్రం తన కూతురికి సినిమాలంటే పిచ్చి. సినిమాల్లో నటించేలానేది జాన్వీ కోరిక. జాన్వీ ఖచ్చితంగా సినిమాల్లోకి వస్తుంది.... అని అంటూనే కానీ అది ఎప్పుడన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేనని సెలవిస్తోంది. అయితే జాన్వీ హీరోయిన్ గా సినిమా కన్ఫర్మ్ అయ్యాక శ్రీదేవే స్వయంగా మీడియాకి తెలియజేస్తానని చెబుతుంది.

Advertisement
CJ Advs

అంతేకాకుండా జాన్వీ కపూర్ కి హీరోయిన్ గా చాలానే ఆఫర్స్ వస్తున్నాయట. సినీ పరిశ్రమ నుంచి ఆఫర్లు వస్తున్న మాట నిజమే కానీ... చాలావరకు మేము వాటిని రిజెక్ట్ చేస్తున్న మాట కూడా నిజం. కానీ మేము అలా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామనడానికి మా కారణాలు మాకున్నాయి అంటూ గడుసుగా సమాధానం ఇస్తుంది శ్రీదేవి. అయితే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా దింపిదింపగానే భారీ సక్సెస్ ని అందుకోవాలి గాని ఆ సినిమా ఫలితం అటో ఇటో అయితే ఆమె భవిష్యత్తు మరలా అటు ఇటు అయ్యే ప్రమాదం ఉండబట్టే శ్రీదేవి, బోణి కపూర్ ఇంతటి కన్ఫ్యూషన్ కి గురవుతున్నారని ఇన్సైడ్ సమాచారం.

మరి ఎప్పటినుండో ఇదే సస్పెన్స్ ని మెయింటింగ్ చేస్తున్న శ్రీదేవి కనీసం ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వడంలేదు. కానీ తాను మాత్రం సినిమాల్లో బిజీగా ఉంటూ తన సినిమా 'మామ్' ప్రమోషన్స్ లో తెగ బిజీగా వుంది. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన మామ్ జులై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sridevi Talks about jhanvikapoor:

Sridevi confirms Jhanvi Kapoor’s entry into films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs