Advertisement
Google Ads BL

'డీజే' కి మరో క్యాస్ట్ సమస్య వచ్చేలా వుంది..!


'డీజే దువ్వాడ జగన్నాథం' చిత్రం ఈ శుక్రవారమే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం వివాదాలతోనే విడులైంది. అల్లు అర్జున్  బ్రాహ్మణుడుగా నటిస్తున్న 'డీజే' చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.... ఒకపాటలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని పదాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లిన విషయం తెలిసందే. ఇంకా ఆ విషయం మరవకముందే 'డీజే' మరో వివాదంలో చిక్కుకునేలా కనబడుతుంది. బ్రాహ్మణ కులం వారు ఆగ్రహించినట్టే మరో కులంవారు 'డీజే' పై దండెత్తుతారనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

'బెజవాడలో పైన అమ్మవారు ఉంటారు…కింద కమ్మవారు ఉంటారు….' అంటూ దువ్వాడ జగన్నాథమ్ లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వివాదస్పదం అయ్యేలా ఉంది. ఈ డైలాగ్ ఏ ఉద్దేశ్యంతో రాసారో తెలియదుగాని ఇప్పుడు కమ్మ కులంవారు 'డీజే' పై దండెత్తే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మామూలుగానే బెజవాడ అంటే రౌడీయిజం అని, కులపిచ్చి అని, ముఖ్యంగా కమ్మవాళ్ళ నగరం అని పేరుంది. మరి ఇప్పుడు పనిగట్టుకుని డీజే లో కమ్మ కులాన్ని కెలికి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారనే టాక్ వినబడుతుంది.

మరి అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ని చూస్తుంటే బెజవాడ అంటే కమ్మవాళ్ళదే, ఆ తర్వాతే ఎవరిదైనా..అనే భావనని బలపరుస్తోంది. మరి ఈ డైలాగ్ విషయంలో చిత్ర యూనిట్ మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో.. అంటున్నారు.

Another Caste Controversy on DJ:

DJ movie Dialogue Creates Another Caste Controversy on Duvvada Jagannadham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs